కరోనా కారణంగా ఎంతోమందికి జీవితంలో మర్చిపోలేని విషాదాలు ఎదురయ్యాయి. ఇందుకు టాలీవుడ్ సైతం మినహాయింపు కాదు. అదే సమయంలో పెళ్లికాని నటీనటులకు కరోనా.. లాక్ డౌన్ కలిసి వచ్చేలా చేయటమే కాదు.. వరుస పెట్టి పెళ్లిళ్లు చేసేసుకున్నారు. కెరీర్ కోసం ఎప్పటికప్పుడు పెళ్లిని పోస్ట్ పోన్ చేసే వారంతా.. కరోనా మిగిల్చిన అనుభవంతో తమ మైండ్ సెట్ మార్చేసుకున్నారని చెబుతున్నారు.
ఇలాంటివేళ.. ఒకహీరోయిన్ కు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ఇండస్ట్రీలో చర్చకు తెర తీసింది. ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ అయిన ఒక హీరోయిన్ కు బాలయ్యతో మూవీ చేసే ఛాన్సు వచ్చిందట. దీంతో.. పెళ్లిని కాస్త పోస్ట్ పోన్ చేసి.. సినిమా చేయటానికి ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటారా? ఇంకెవరు తన అందంతో కుర్రకారు మదిని దోచే మెహ్రీన్. ప్రస్తుతం ఎఫ్ 3 మూవీతో పాటు మారుతి మూవీకి ఓకే చెప్పింది.
తాజాగా బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో భారీ చిత్రానికి ప్లాన్ చేశారు. ఇందులో మెహ్రీన్ కు అవకాశం ఇచ్చారు. ఈ మూవీ కోసం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ కోసం పెళ్లిని పోస్టు పోన్ చేసినట్లుగా చెబుతున్నారు. కెరీర్ కోసం ఆ మాత్రం త్యాగాలు తప్పవన్న మాట వినిపిస్తోంది. మరీ.. వార్తలో నిజం ఎంతన్నది తెలియాలంటే మెహ్రీన్ కాస్త నోరు విప్పితే మరింత క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.