ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భరత్ మాతృమూర్తి హఠాన్మరణం చెందారు. భరత్ తల్లి పేరు కమలహాసిని. చెన్నైలో భరత్ కుటుంబ నివాసం ఉంటుంది. అయితే గుండెపోటు రావడంతో కమలహాసిని చెన్నైలోనే ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కమలహాసిని మరణంతో భరత్ తో పాటు అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఫోన్ చేసి భరత్ కు ధైర్యం చెబుతున్నారు. కాగా, చెన్నైలో పుట్టి పెరిగిన భరత్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్ లో యాక్ట్ చేశాడు.
తనదైన యాక్టింగ్, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులకు భారత్ ఎంతగానో చేరవయ్యాడు. రెడీ మూవీలో భారత్ పోషించిన చిట్టినాయుడు పాత్రను ఆడియెన్స్ ఇప్పటికీ మర్చపోలేదు. వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, పెదబాబు, గుడుంబా శంకర్, హ్యాపీ, పోకిరి, అందాల రాముడు, దుబాయ్ శీను వంటి చిత్రాలు కూడా భారత్ కు మంచి పేరు తెచ్చిపెట్టారు. ఉత్తమ బాలనటుడిగా రెండుసార్లు నంది అవార్డు అందుకున్న మాస్టర్ భారత్.. హీరోగానూ పలు సినిమాలు చేశాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. భారత్ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. ప్రస్తుతం సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.