మంచు విష్ణుకు మరోసారి బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పేలా లేదు. గత సినిమాలతో పోలిస్తే ఈసారి అతడి నుంచి వచ్చిన జిన్నా మూవీకి డీసెంట్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులు ఆ సినిమాను పట్టించుకోవడం లేదు. దీపావళికి ఆల్రెడీ మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయని తెలిసి కూడా జిన్నా సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం విష్ణు చేసిన పెద్ద తప్పు.
ఇందుకతను భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాడు. జిన్నా మూవీకి జనాల్లేక తొలి రోజు నుంచి చాలా చోట్ల షోలు రద్దు చేస్తున్నారు. ఈ పరిస్థితి సినిమా రిలీజైన ప్రతి చోటా ఉంది. కాగా మంచు విష్ణు మాత్రం రిలీజ్ రోజు ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్లు చేసేసుకున్నాడు. విడుదల తర్వాత కూడా సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు.
కాగా ప్రవాసాంధ్రులతో నిర్వహించే ఒక టీవీ షోలో జిన్నా రైటర్ కోన వెంకట్‌తో కలిసి పాల్గొన్న విష్ణుకు పెద్ద షాక్ తగిలింది. అభిమాని ఒకరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గ్రౌండ్ లెవెల్లో జిన్నా మూవీ పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పేశాడు. బెంగళూరులో ఈ సినిమాకు చాలా తక్కువ షోలు ఇచ్చారని.. ఐతే అతి కష్టం మీద ఒక థియేటర్లో షో చూద్దామని వెళ్తే అక్కడ షో క్యాన్సిల్ చేశారని అతను వెల్లడించాడు.
కనీసం పది మంది అయినా లేకుంటే షో వేయలేమంటూ షోను రద్దు చేసినట్లు అతను వెల్లడించాడు. ఈ మాటకు ఎలా స్పందించాలో విష్ణుకు అర్థం కాలేదు. ఈ వారం బెంగళూరులో ఒకేసారి 11 సినిమాలు రిలీజయ్యాయని.. కాబట్టి ఈ పరిస్థితి ఉందని అతను కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ ఎంత పోటీ ఉన్నా కనీసం పది టికెట్లు తెగలేదంటే విష్ణు సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నెగెటివ్ ప్రాపగండా చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని ఎంత ఏడ్చినా.. బేసిగ్గా మంచు వారి సినిమాలంటే జనాలు అసలు పట్టించుకోవట్లేదన్న వాస్తవాన్ని గ్రహించాల్సిందే.
Ginna Blockbuster hit.. ???????? trollers andariki rod lanta…
Wait For End ???????????????? #Ginna #GinnaBhai #GinnaMovieReview #Manchuvishnu pic.twitter.com/xeGJCv8BXI— Telugu Swaggers (@Telugu_Swaggers) October 21, 2022