మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. మంచు బ్రదర్స్ మధ్య చోటు చేసుకున్న విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం మంచు మనోజ్ `భైరవం` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో మనోజ్ రీఎంట్రీ ఇస్తున్నాడు.
విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన మల్టీస్టారర్ మూవీ ఇది. మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. మే 30న భైరవం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్.. సినిమా విశేషాలనే కాకుండా పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబును ఉద్దేశిస్తూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.
`మా నాన్న దగ్గరికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకోవాలని ఉంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ అలా చేస్తే చేయని తప్పును అంగీకరించినట్లే అవుతుంది. అప్పుడు నా పిల్లలకు నేనేం నేర్పించగలను. అందుకే ముందడుగు వేయలేకపోతున్నా. మళ్లీ మేమంతా కలిసి ఉండాలని దేవుడిని రోజూ కోరుకుంటున్నా. కుటుంబంలో ఒకరికి మాత్రమే నేను నచ్చడం లేదు. సమస్యలను సృష్టించిన వారే తప్పులు తెలుసుకుంటారనే నమ్మకం నాకు ఉంది` అంటూ మనోజ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి మనోజ్ కి విభేదాలు తండ్రి మోహన్ బాబుతో కాదు కేవలం విష్ణుతో మాత్రమే అని ఆయన మాటలతో పూర్తిగా స్పష్టమైంది.