మంచు అన్నదమ్ములు విష్ణు, మనోజ్‌ల మధ్య విభేదాల గురించి ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. మనోజ్ పెళ్లికి విష్ణు అతిథిలా వచ్చి వెళ్లడంతో ఈ చర్చ మొదలైంది. తాజాగా తన మనుషులను విష్ణు కొడుతున్నాడంటూ మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది.
ఐతే విష్ణు ఈ వీడియో గురించి వెంటనే వివరణ ఇచ్చాడు. మనోజ్ తన తమ్ముడని.. తమ మధ్య జరిగింది చిన్న విషయం అని అతను గొడవను తేలిక చేసే ప్రయత్నం చేశాడు. ఐతే ఈ విషయంలో మనోజ్ స్పందనేంటో తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే మనోజ్ సూటిగా ఏమీ స్పందించడం లేదు కానీ.. కొన్ని కోట్స్‌తో కూడిన పోస్టులు పెట్టి అందరినీ గెస్సింగ్‌లో ఉంచుతున్నాడు.
కళ్లముందు జరుగుతున్న తప్పులను చూసీ చూడనట్లు వదిలేయడం కంటే నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే.. ఇదీ మనోజ్ లేటెస్టుగా షేర్ చేసిన ఒక కోట్. దీంతో పాటు ‘‘క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు అని ఇంకో కోట్.. ‘‘మీరు బతకండి.. ఇతరులను కూడా బతకనివ్వండి’’ అంటూ దండం పెడుతున్న ఎమోజీ ఉన్న మరో కోట్ కూడా అతను షేర్ చేశాడు.
మనోజ్ ఉన్నట్లుండి ఇలా ఫిలసాఫికల్ పోస్టులు పెడుతుండటం చర్చనీయాంశమైంది. అన్నతో విభేదాల నేపథ్యంలోనే ఇలా ఇన్‌డైరెక్ట్‌గా ఏదో చెప్పాలని అతను భావిస్తున్నారు నెటిజన్లు. అతడి పోస్టులపై మంచు ఫ్యామిలీ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ఏ కుటుంబంలో అయినా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమే అని.. అవన్నీ పక్కన పెట్టి మోహన్ బాబును బాధ పెట్టకుండా కలిసిమెలిసి సాగాలని హితవు పలుకుతున్నారు.