గత వారం థియేట్రికల్ రిలీజ్ అయిన తెలుగు చిత్రాల్లో `మ్యాడ్ స్క్వేర్` ఒకటి. `మ్యాడ్` వంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ఇది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ కు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. మంచి అంచనాల నడుమ వచ్చిన మ్యాడ్ స్క్వేర్.. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం.. నాలుగో రోజు కూడా ఎక్స్లెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఏపీ మరియు తెలంగాణలో మ్యాడ్ స్క్వేర్ మూవీకి 4 డేస్‌లో రూ. 20.79 కోట్ల షేర్, రూ. 33.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో రూ. 5.15 కోట్లు రాబట్టింది.
అలాగే వరల్డ్ వైడ్‌గా నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ. 27.49 కోట్ల షేర్, రూ. 47.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మ్యాడ్ స్క్వేర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 21 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లు. ఈ టార్గెట్ ను మ్యాడ్ బాయ్స్ మూడు రోజులకే చిత్తు చిత్తు చేవారు. ప్రస్తుతం సినిమా రూ. 5.49 కోట్ల లాభాలను గడించి బాక్సాఫీస్ వద్ద మరింత జోరుగా పరుగులు పెడుతోంది. ఇక మ్యాడ్ స్క్వేర్ కు పోటీగా వచ్చిన నితిన్ `రాబిన్ హుడ్` బొక్కబోర్లా పడగా.. డబ్బింగ్ బొమ్మ `ఎల్ 2 – ఎంపురాన్` యావరేజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటోంది.