ఇటీవల ముగిసిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగి 144 విధించాల్సి వచ్చింది. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ నాడు రౌడీయిజం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. మాచర్ల నియోజకవర్గంలోని పాలువాయి గేటులోని పోలింగ్ కేంద్రం(పోలింగ్ స్టేషన్ నెంబర్ 202) ఓ ఈవీఎంను పిన్నెల్లి బద్దలు కొట్టిన వీడియో వైరల్ గా మారింది.
ఇక, పిన్నెల్లి దాష్టీకాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ ను పిన్నెల్లి, ఆయన అనుచరులు బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వైనం కూడా రికార్డయింది. వెబ్ కాస్టింగ్ పుణ్యమా అంటూ పిన్నెల్లి దారుణం ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లిపై మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ పిన్నెల్లీ… నువ్వు ప్రజాప్రతినిధివా, లేక వీధి రౌడీవా? అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీ మాదిరి ఈవీఎంను పగులగొడతావా? బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధివన్న సంగతి మరచిపోయావా? నీకు ఓటమి తాలూకు భయం నరనరాన జీర్ణించుకుపోయింది’’ అని జూలకంటి మండిపడ్డారు.
పోలీసు, న్యాయ వ్యవస్థలు ఏమీ చేయలేవన్న ధీమాతోనే పిన్నెల్లి ఇంత దారుణానికి ఒడిగట్టాడని, ప్రజాకోర్టులో తీర్పు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. పిన్నెల్లిపై ఈసీ చర్యలు తీసుకొని అతడిని డిస్క్వాలిఫై చేయాలని కోరారు. ‘అసెంబ్లీ రౌడీ’ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అంటూ ఆ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదు.
పోలింగ్ జరిగిన రోజు, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క… pic.twitter.com/RaZiLJfdKl
— Telugu Desam Party (@JaiTDP) May 21, 2024