ప్రేయసికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా 500 ల్యాపీల్ని దోచేశాడు

ఇదో సిత్రమైన క్రైం కథ. రీల్ కంటెంట్ కు సరిగ్గా సూట్ అయ్యే ఈ నేరం గురించి తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా ఒక ల్యాప్ టాప్ దొంగను పోలీసులు పట్టుకున్నారు. రోజువారీగా చేసే దర్యాప్తులో.. ఈ ల్యాప్ టాప్ దొంగను విచారించిన పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే.. దాదాపు ఆరేళ్ల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటానికే ల్యాప్ టాప్ లను చోరీ చేస్తున్నట్లుగా చెప్పిన వైనం విస్మయానికి గురి చేసింది. ఇంతకూ అసలేం జరిగిందంటే?

24 ఏళ్ల కన్నన్ కు ఒక ప్రేయసి ఉంది. ఆమెను అసభ్యకరంగా చిత్రీకరించి వేధింపులకు గురి చేశారు ఆమెతో పాటు చదివే మెడిసిన్ విద్యార్థులు. దీంతో.. తీవ్ర ఆవేదనకు గురైన కన్నన్.. తన ప్రేయసికి జరిగిన అవమానానికి ప్రతిగా.. మెడిసిన్ చదివే వారిని టార్గెట్ చేశాడు. వారి ల్యాప్ టాప్ లను దోచేసేవాడు. ఇలా ఒకటి కాదురెండు కాదు.. పది కాదు.. ఏకంగా 500 ల్యాప్ టాప్ లను దోచేశాడు.
తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఒక ల్యాప్ టాప్ దొంగను పట్టుకొన్న పోలీసులు తమదైన విచారణ జరపగా.. అతగాడి నేరాల చిట్టా వెల్లడించాడు. అతను చోరీ చేసిన వాటిల్లో ల్యాప్ టాప్ లే అత్యధికంగా ఉన్నాయి. దీనికి కారణం ఆరా తీసినప్పుడు అతడి గర్ల్ ఫ్రెండ్ కు జరిగిన అవమానం ఎపిసోడ్ బయటకు వచ్చింది. తన లక్ష్యం.. మెడిసిన్ చదివే విద్యార్థులేనని.. వారి ల్యాప్ టాప్ లను పెద్ద ఎత్తున చోరీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు.ఇంటర్నెట్ లో మెడికల్ కాలేజీల సమాచారాన్ని సేకరించేవాడినని.. అనంతరం రెక్కీ నిర్వహించి.. ల్యాప్ టాప్ ల్నిదొంగతనం చేసే వాడినని కన్నన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో ల్యాపీలను తాను కొట్టేసినట్లు చెప్పాడు. తాను చోరీచేసిన ల్యాపీల్లో అత్యధిక దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మెడికోలవేనని వెల్లడించాడు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.