ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ల కాంబోలో ‘ఆదిపురుష్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘ఆదిపురుష్’ సినిమా గురించి దర్శకుడు ఓం రౌత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రామాయణంలో ఉన్న అన్ని మెయిన్ పాయింట్లను ‘ఆదిపురుష్’లో చూపిస్తామని, షూటింగ్ కోసం 7000 సంవత్సరాల క్రితం సెట్ వేశామని చెప్పారు. రామాయణ కథని ఆధునిక కథా పద్ధతులతో చెప్పానని, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదని, రాముడికి మరో పేరు రాఘవ కాబట్టి ప్రభాస్ కు రాఘవుడు అనే పేరు వాడామన్నారు. కృతి సనన్ పోషించిన సీత క్యారెక్టర్ ను జానకి పేరుతో పిలుస్తున్నామన్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడి క్యారెక్టర్ కు లంకేష్ అని పేరు పెట్టామని వెల్లడించారు.
ఆదిపురుష్ అంటే “మొదటి మనిషి” అని అర్థం అని, కానీ, తాము “ఉత్తమ పురుషుడు” అనే అర్ధంలో దానిని తీసుకున్నామని చెప్పారు. ఈ సినిమాలో రాముడిలో మరో కోణం పరాక్రమ రాముడిని చూపించబోతున్నానని అన్నారు.“ఆదిపురుష్” సినిమా 2022 చివర్లో రిలీజ్ అవుతుందని, పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవ్వనుందని తెలిపారు.
ప్రభాస్, సైఫ్ ఆలీ ఖాన్ వంటి స్టార్స్‌తో పని చేయడం ఎంతో అద్బుతంగా ఉందని, ప్రతీ సీన్‌ను వారు అర్థం చేసుకుని, నటించే తీరు గొప్పగా ఉంటుందని కితాబిచ్చారు ఓం రౌత్. ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఎంతో దయాగుణంగలవాడని ఓం రౌత ప్రశంసించారు. ఎంతో లాజికల్‌గా ఆలోచిస్తాడని, ఆయన ఇచ్చే ఆతిథ్యం, హోం ఫుడ్ కాకుండా ఇంకో ప్రత్యేకమైన గుణం ఆయనలో ఉందని అన్నారు. సెట్లో హోదాతో సంంబంధం లేకుండా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితోనూ మర్యాదగా ఉండే గొప్ప మనిషి ప్రభాస్ అని పొగడ్తలతో ముంచెత్తారు. అందరి గురించి ఆలోచించేంత మంచివాడని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.