కాకినాడ సీ పోర్టు వాటాల వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. కేవీ రావు దగ్గర నుంచి పోర్టులో వాటాను జగన్ హయాంంలో వైసీపీ నేతలు విజయ సాయిరెడ్డి , వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డిలు బలవంతగంగా లాగేుకున్నారని ఆరోపణలు వచ్చాయి. తనను వారు బెదిరించి రూ.3600 కోట్ల వాటాను తీసుకున్నారని ఏపీ సీఐడీ అధికారులకు కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు..తాజాగా ఆ ముగ్గురుకి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు దేశం దాటి పోకుండా ఉండేందుకు సీఐడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా భారత్ లోని అన్ని ఎయిర్ పోర్టులకు ఎల్వోసీలు పంపారు సీఐడీ అధికారులు. వాటాలు తమకు రాసివ్వకుంటే అక్రమ కేసులు పెడతామని కేవీ రావును బెదిరించారని సీఐడీకి ఫిర్యాదు అందింది. ఈ విధంగా కాకినాడ సీ పోర్టులో ఎక్కువ షేర్లు అరబిందో సంస్థ దక్కించుకుందని, ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్నారని సీఐడీ తెలిపింది.