• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాష్ట్ర ప్రజలకు లోకేష్ బహిరంగ లేఖ

admin by admin
January 25, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
156
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 27వ తేదీ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌ లో తన తాతయ్య నందమూరి తారక రామారావుకు లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటి నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు భారీ బైక్ ర్యాలీ నడుమ లోకేష్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లనున్న లోకేష్ కడప అమీన్‌పీర్‌ దర్గా, మరియాపురం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి 6.30 గంటలకు రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారు. కుటుంబ సభ్యులతో కలిసి 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 27వ తేదీన కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నుంచి పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టునున్నారు.

పాదయాత్రకు బయలుదేరే ముందు తల్లిదండ్రుల వద్ద నుంచి ఆశీస్సులు తీసుకున్న లోకేష్ ను మేనమామ బాలకృష్ణ దగ్గరుండి కారు ఎక్కించారు. పాదయాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా ప్రజలకు లోకేష్ బహిరంగ లేఖ రాశారు.

‘‘ విభ‌జ‌న అనంత‌రం లోటు బ‌డ్జెట్ తో ఏర్ప‌డిన రాష్ట్రాన్ని ఐదేళ్ల‌లో తెలుగుదేశం ప్ర‌భుత్వం గాడిలో పెట్టి, న‌వ్యాంధ్ర నిర్మాణానికి చేసిన కృషి మీకు తెలుసు. ఒక్క‌చాన్స్ ఇవ్వండ‌ని కాళ్లావేళ్లా ప్రాధేయ‌ప‌డి 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం సాగిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. వైసీపీ బాదుడే బాదుడు పాల‌న‌లో బాధితులు కాని వారు లేరు.

క‌ర్ష‌కులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, వృద్ధులు …ఇలా ప్రతివర్గం మాకొద్దీ అరాచ‌క‌పాల‌న అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప్రాథ‌మికంగా పౌరుల‌కు ఇచ్చిన ప్ర‌శ్నించే హ‌క్కుని వైసీపీ నేత‌లు హ‌రించారు. రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి నియంత కంటే ఘోరంగా రాక్ష‌స పాల‌న కొన‌సాగిస్తున్నారు. ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షంపై దాడులకు దిగారు.

ప్ర‌జ‌ల ప్రాణాల‌కూ ర‌క్ష‌ణ లేదు. మ‌హిళ‌ల మానప్రాణాలు దైవాధీన‌మ‌య్యాయి. యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల్ని బెదిరించి పంపేస్తున్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఎలాగూ రావ‌డంలేదు. ఉన్న‌వీ త‌రిమేస్తున్నారు. బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్న రాజ్యాంగ‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌పైనా మూక‌దాడుల‌కు తెగ‌బడుతున్నారు. కుల‌,మ‌త‌,ప్రాంతాల పేరుతో విద్వేషాలు ఎగ‌దోసి వికృత రాజ‌కీయానికి తెర‌లేపారు.

ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించి, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన పోలీసు వ్య‌వ‌స్థను జ‌గ‌న్ రెడ్డి త‌న ఫ్యాక్ష‌న్ పాలిటిక్స్ న‌డిపించే ప్రైవేటు సైన్యంగా వాడుతున్నారు. అన్నివ‌ర్గాల‌కు అన్యాయంచేసిన వైసీపీ ప్ర‌భుత్వం, అన్నిరంగాల‌ను కోలుకోలేని విధంగా దెబ్బ‌తీసింది. మ‌న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. పెను సంక్షోభంలోకి ప్ర‌జ‌ల్ని నెట్టేస్తున్న స‌ర్కారుని త‌క్ష‌ణ‌మే గద్దె దింపాల్సిందే. తుగ్ల‌క్ నిర్ణయాలతో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్త‌మైంది.

వైద్య ఆరోగ్య రంగం ప‌డ‌కేసింది. జ‌ల‌వ‌న‌రుల‌శాఖ ఎంత అధ్వానంగా ఉందో కొట్టుకుపోయిన అన్న‌మ‌య్య డ్యాం, ఊడిపోయిన పులిచింత‌ల‌ ప్రాజెక్టు గేట్లు తేట‌తెల్లం చేశాయి. అప్పులు, డ్ర‌గ్స్‌, రైతు ఆత్మ‌హ‌త్య‌లు, వలసల్లో మ‌న రాష్ట్రం మొద‌టిస్థానంలో ఉండ‌టం మ‌న‌మంతా సిగ్గుతో దేశం ముందు త‌ల‌దించుకోవాల్సిన దుస్థితి. ప్ర‌జ‌ల ప్రాణాలు తీసే ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం అమ్మ‌డ‌మే ఆదాయంగా భావించే జగ‌న్ రెడ్డిలాంటి సైకో పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది.

ధాన్యం అమ్ముకొలేని రైతుల దైన్యం, చేసేందుకు ప‌నిలేక వ‌ల‌స‌పోతున్న జ‌నం, ఉద్యోగాలు దొర‌క‌క ప‌క్క రాష్ట్రాల‌కు ప‌రుగులు పెడుతున్న యువ‌త, పెరిగిన ధ‌ర‌లతో నిత్యావ‌స‌రాలు కొన‌లేని సామాన్యులు, ప‌న్నుల‌తో బ‌తుకు భార‌మైన ప్ర‌జ‌లు, గంజాయికి బానిసైన పిల్ల‌ల్ని చూసి రోదిస్తున్న త‌ల్లిదండ్రులు, స‌కాలంలో జీతాలు అంద‌ని ఉద్యోగులు, బిల్లులు రాని కాంట్రాక్ట‌ర్లు… ఇవన్నీ సైకో పాల‌న దుష్ఫ‌లితాలు. ఈ నేపధ్యంలో బాధితుల తరపున నేను ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

సైకో పాల‌న‌లో ఇబ్బందులు ప‌డుతున్న స‌క‌ల‌జ‌నుల గొంతుక నేన‌వుతా. మీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి అరాచ‌క స‌ర్కారుతో పోరాడ‌టానికి సార‌ధిగా వ‌స్తున్నాను. యువ‌త‌కి భ‌విత‌న‌వుతాను. అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తాను. రైత‌న్న‌ని రాజుగా చూసేవ‌ర‌కూ విశ్ర‌మించ‌ను. ఆడబిడ్డలకు సోద‌రుడిగా ర‌క్ష‌ణ అవుతాను. అవ్వాతాత‌ల‌కు మ‌న‌వ‌డినై బాగోగులు చూస్తాను. మీరే ఒక ద‌ళ‌మై, బ‌ల‌మై నా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని న‌డిపించండి. మీ అంద‌రి కోసం వ‌స్తున్న న‌న్ను ఆశీర్వ‌దించండి’’ – నారా లోకేష్

Tags: Balakrishnablessingschandrababu's blessingsletter to peoplenara lokeshpadayatrayuvagalam
Previous Post

తారక్, చెర్రీలకు రాజమౌళి క్షమాపణలు

Next Post

అవినాష్ రెడ్డికి సీబీఐ తాజా షాక్

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post

అవినాష్ రెడ్డికి సీబీఐ తాజా షాక్

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra