టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆయన కూడా అంతే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల గుట్టును ఆయన రట్టు చేస్తున్నారు. తారీకులు.. దస్తావేజులు.. అన్నట్టుగా నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు.. అంటూ బయటకు తీస్తున్నారు. తాజాగా కావలి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్.. ఇక్కడి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యవహారాన్ని బట్టబయలు చేశారని టీడీపీనేతలు చెబుతున్నారు.
దీంతో నారా లోకేష్ వ్యవహార శైలిపై విస్మయం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాంరెడ్డి.. ఇంత చేస్తారని అనుకోలే దు.. అని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎమ్మెల్యే రాంరెడ్డిని నారా లోకేష్ అవినీతి అనకొండతో పోల్చడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అవినీతిపై అక్రమాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలే పాంప్లెట్లు వేసి ఊరూరా పంచుతున్నారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. రాంరెడ్డి అవినీతికి అదుపే లేదంటూ లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంతేకాదు.. ఎమ్మెల్యే అవినీతి బాగోతాలపై సిట్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. జగన న్న లేఅవుట్లకు భూ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, బినామీల ద్వారా ఎకరా రూ.10 లక్షలకు కొనుగోలు చేసి అదే భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షలకు విక్రయించారని ఎమ్మెల్యేపై ఆధారాలతో సహా నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు.
ఈ సొమ్మంతా కూడా ఎమ్మెల్యే ప్రతాప్ నొక్కేశారని.. ఆయన బ్యాంకు ఖాతాల గుట్టు తీస్తే అంతా బయట కు వస్తుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు స్థానికంగా ఎమ్మెల్యేకు సెగతగిలేలా చేశాయి. దీంతో ఎమ్మెల్యే వెంటనే రియాక్ట్ అయి.. నారా లోకేష్ ఇంత పనిచేస్తాడని అనుకోలేదని.. వ్యాఖ్యానించినట్టు టీడీపీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు నారా లోకేష్ మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వంటివారిని ఏకేయడం గమనార్హం.