ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రైతు సమస్యలపై స్పందించన ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగు రైతు అధ్యక్షుడు మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చే చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ నిరసనలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీకి ర్యాలీగా ఎడ్లబండ్లతో బయలుదేరింది.
అయితే, ఈ క్రమంలోనే అసెంబ్లీ సమీపంలో ఆ ర్యాలీపై పోలీసుసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు, నిరసన తెలిపేందుకు వచ్చిన టీడీపీ నేతలతో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు, ఆ ఎద్దులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసులు తీరుకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు చేురుకొని నిరసన తెలిపారు.ఎడ్ల బండిని ఇచ్చిన రైతును సిఐ దుర్భాషలాడడడంపై మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఎడ్లను పోలీసులు తీసుకోవడంపై వారితో లోకేష్ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతలతో కలిసి పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్లబండ్లును మోసేందుకు లోకేష్ కాడెద్దులా మారారు. లోకేష్. అచ్చన్నాయుడు. రామానాయుడు, చిన్ననాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యేలు ఎడ్ల బండ్ల కాడ మోస్తు పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు ఎడ్ల బండిని లోకేష్ తదితర నేతలు లాక్కుంటూ వెళ్లారు.
టీడీపీ నిరసన కార్యక్రమానికి ఎడ్ల బండి ఇచ్చిన రైతులను తీవ్రంగా కొట్టారని అచ్చెన్నానాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి కోటరీ వల్లే రైతాంగానికి మూడేళ్లుగా తీవ్ర అన్యాయం జరుగుతోందని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడ్లబండి కాడి మోస్తూ అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు. pic.twitter.com/QAjdPdRrQB
— iTDP Official (@iTDP_Official) September 19, 2022
అసెంబ్లీని తాకిన తెలుగు రైతు విభాగం నిరసన! #BoycottJagan pic.twitter.com/wA1ttkkOJV
— iTDP Official (@iTDP_Official) September 19, 2022
తెలుగుదేశం నిరసన చేపడుతుందని ఆఖరికి ఎడ్లను కూడా అరెస్టు చేయడమేంటి పిరికి జగన్ ? #EndOfYCP pic.twitter.com/yn8xH7Y7ss
— iTDP Official (@iTDP_Official) September 19, 2022