డీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలులో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు పాదయాత్ర సందర్భంగా స్థానిక ఎస్టీబీ గ్రౌండ్స్ లో ముస్లిం మైనారిటీలతో నారా లోకేష్ ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కు ఒక యువతి వేసిన ప్రశ్న దానికి ఆయన చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మీకు ముస్లిమ్ స్నేహితులు ఉన్నారా? వారితో అనుబంధం ఎలా ఉంది? అని లోకేష్ ను ఒక ముస్లిం యువతి ప్రశ్నించింది. దానికి సమాధానంగా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో టీనేజ్ లో అందరూ కుర్రాళ్ళలాగే తాను కూడా చేయాల్సిన వెధవ పనులన్నీ చేశానని లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. తాను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే అని, తనకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. రంజాన్ పవిత్ర మాసం అని, ఆ మాసంలో తమకు పాతబస్తీలోని ముస్లిమ్స్ స్నేహితులు హలీం, బిర్యానీలతో విందు ఇచ్చే వారిని లోకేష్ అన్నారు.
ఇక, ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా తన తనయుడు దేవాన్ష్ కూడా మొట్టమొదటిసారి హలీంను రుచి చూశాడని లోకేష్ గుర్తు చేసుకున్నారు. బ్రాహ్మణితో కలిసి ఓల్డ్ సిటీలో దేవాన్ష్ హలీం టేస్ట్ చేశాడని లోకేష్ గుర్తు చేసుకున్నారు. అంతకుముందు పాదయాత్ర సందర్భంగా జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. మద్యపానం నిషేధం తెస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ వైన్ షాపులకు అనుమతులిచ్చారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఒక వైన్ షాప్ ముందు లోకేష్ సెల్ఫీ దిగి జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.