టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధానా కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ఆయన భార్య నారా బ్రహ్మణి దంపతులు మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఈ పెళ్లికి ఎలాంటి హడావిడి లేకుండా లోకేష్ దంపతులు అక్కడకు వెళ్లారు. చంద్రబాబు ఫుల్ బిజీగా ఉండడంతో లోకేష్ భార్యతో కలిసి ఈ పెళ్లికి హాజరు అయ్యారు.
చంద్రబాబు ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు అయిన డాక్టర్ శ్రీనివాస్ కొత్తపల్లి పిల్లల పెళ్లి వేడుకకు వెళ్లిన లోకేష్ దంపతులు 72 గంటల పాటు అక్కడే ఉన్నారు. నిన్న రాత్రి అక్కడ బయలు ఈ రోజు రాత్రి ఇండియాకు రానున్నారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఈ పెళ్లి జరిగింది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ట్రిప్ మాత్రమే.. దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.
ఇక డాక్టర్ శ్రీనివాస్ కొత్తపల్లి ఇంట్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు లోకేష్ దంపతులు పెద్ద ఎట్రాక్షన్‌గా నిలిచారు. వీరితో కలిసి ఫొటోలు దిగేందుకు ఆ వేడుకకు వచ్చిన పలువురు పోటీ పడ్డారు. లోకేష్ అందరితోనూ కలివిడిగా మాట్లాడడంతో పాటు అమెరికాలో తెలుగు ప్రజల సాధక బాధకాల గురించి తెలుసుకున్నారు.