టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ గెలుపు ఎంత అవసరం? ఆయన గెలిచి తీరాల్సిన పరిస్థితి ఎంత వరకు ఉంది? అనే విషయాలను గమనిస్తే.. చాలా చాలా అవసరమేనన్న వాదన వినిపిస్తోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గత 2019లో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేసినప్పు డు 5333 ఓట్లతేడాతో లోకేష్ ఓడిపోయారు. ఇక, ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి తలపడుతు న్నారు. అయితే.. వైసీపీ ఇక్కడి టికెట్‌ను బీసీలకు కన్ఫర్మ్ చేసింది.
సరే.. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ.. నారా లోకేష్ గెలిచి తీరాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 1) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యువగళం సక్సెస్ అయిందనే వాదన మంగళగిరి నుంచే వినిపిస్తుంది. రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎందరు గెలిచి ఎందరు ఓడినా.. అంతిమంగా నారా లోకేష్ గనుక గెలుపు గుర్రం ఎక్కకపోతే.. ఆయన చేసిన యువగళం ఫలించలేదన్న వాదన తెరమీదికి వస్తుంది.
ఇక, రెండో రీజన్.. మంగళగిరిలో మరింతగా పట్టుకోల్పోవడం. గత ఎన్నికల్లోనే పోటీ చేసి ఓడిన నేపథ్యం లో నారా లోకేష్.. ఇప్పుడు గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. మరో ఐదేళ్లు వేచి చూడాలి. పైగా ఇక్కడే మళ్లీ అంటే.. అనుమానాలు ముసురుకోవడం తప్పదు. ఇక, అప్పటికి ఆయనకు 40+ దాటి పోతుంది. దీంతో ఇది కూడా.. పార్టీకి ఇబ్బందిగానే ఉంటుంది. చంద్రబాబుకు కూడా.. తన తనయుడిని గెలిపించుకోలేక పోయారనే అపవాదు స్థిరపడుతుంది.
మూడు.. మంగళగిరిలో గత నాలుగేళ్లుగా నారా లోకేష్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ ప్రజలు హర్షించారని.. నారా లోకేష్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో దాచుకున్నారని చెప్పేందుకు గెలుపు అత్యంతకీలకం. ఇక, బలమైన గళం ఉన్న నారా లోకేష్ అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ద్వారా.. వైసీపీ చేస్తున్న అనేక విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు.. తన పంతం కూడా నెగ్గించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే.. అన్నీ విఫలప్రయోగంగా మారిపోవడంఖాయం. అందుకే.. నారా లోకేష్ గెలుపు.. అవసరం.. అవసరం.. అవసరం.. అంతే!! అంటున్నారు పరిశీలకులు.