వైసీపీ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు మొదలు సామాన్యుల వరకు వైసీపీ నేతల ప్రోద్బలంతో పనిచేస్తున్న కొందరు పోలీసులకు భయపడి బ్రతకాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక, రౌడీ మూకలను కట్టడి చేయలేని ప్రభుత్వం వల్ల సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోవడంతో అక్కడి ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వైజాగ్ లో రౌడీ మూకలు పట్టపగలే కత్తులు తిప్పుతూ తిరుగుతున్న వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ సర్కార్ విఫలమైందని లోకేశ్ ఆరోపించారు. వైజాగ్ సిటీలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు అదుపు చేయలేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పట్టపగలు నడిరోడ్డుపై రౌడీలు కత్తులను బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అసమర్థత వల్ల క్రిమినల్ గ్యాంగులకు చట్టాలన్నా, పోలీసులన్నా భయంలేకుండా పోయిందని ఆరోపించారు. అధికార పార్టీ ఇలాంటి రౌడీలను పెంచి పోషిస్తోందని, ఆ రకంగా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ రౌడీలకు సంబంధించిన వీడియోను లోకేశ్ ట్వీట్ చేయగా అది వైరల్ అయింది.
Horrifying! Criminal gangs are openly flaunting knives and swords in Vizag and terrifying citizens in open day light. There is no fear of law in Andhra Pradesh. The ruling party is a breeding ground for these anti-social elements who are out to destroy peace and harmony in the… pic.twitter.com/IqDsJZFIg2
— Lokesh Nara (@naralokesh) April 1, 2024