చిత్తూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో వైసీపీకి కీలక నేతగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డిపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక సైకో అని, జిల్లాకు ఒక సైకోను తయారుచేశాడని, చిత్తూరు జిల్లాలో జగన్ తయారు చేసిన సైకో పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని షాకింగ్ కామెంట్లు చేశారు.ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మాఫియా, చిత్తూరులో ఏం అవినీతి జరిగినా దానికి కేరాఫ్ అడ్రెస్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చురకలంటించారు.
పాదయాత్రతో వైసీపీ అంతిమయాత్ర మొదలైందని, జగన్ కు లండన్ మందులు కూడా పనిచేయడంలేదని ఎద్దేవా చేశారు. తనను ఆపేందుకు 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలను నియమించిన పిరికివాడు జగన్ అని దుయ్యబట్టారు.
తన సౌండ్ వెహికిల్, మైక్ వెహికిల్, ఆఖరికి తన స్టూలు కూడా లాక్కున్నారని, అయినా తగ్గేదే లే అని, అన్న ఎన్టీఆర్ ఇచ్చిన తన గొంతు నొక్కలేరని జగన్ కు లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ 3 సంవత్సరాల 8 నెలల్లో ఏపీ కోసం జగన్ ఏమీ పీకలేదని, తన మైక్ పీకాడని సెటైర్లు వేశారు. టెన్త్ ఫెయిల్ జగన్ రెడ్డికే అంత తెలివి ఉంటే స్టాన్ ఫోర్డ్ లో చదివిన తనకు ఎంత తెలివి ఉంటుందో ఆలోచించుకోవాలని జగన్ కు చురకలంటించారు. 400 రోజుల పాదయాత్రలో తనపై 400 కేసులు. పెట్టుకోవాలని, భయపడేదేలేదని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు హయాంలో వైఎస్ఆర్, జగన్, షర్మిలలు పాదయాత్ర చేశారని, ఏనాడైనా వారి మైక్ లాక్కున్నారా? అని ప్రశ్నించారు.
లక్ష కోట్లు దొబ్బి తిని జైలుకు వెళ్లి వచ్చిన జగన్ కు నో రూల్స్….ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే నో రూల్స్…చంద్రబాబును అడుగడుగునా తిడితే నో రూల్స్….కానీ నేడు తాను ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే జీవో నెం.1 తెచ్చాడు…అంటూ బాలా మామ మాదిరి లోకేష్ చెప్పిన డైలాగులకు తెలుగు తమ్ముళ్లు ఈలలు వేసి గోల చేశారు.
తాడేపల్లిలో రఘురామిరెడ్డి అనే పోలీసు అధికారి తన పాదయాత్ర గురించి అడుగడుగునా అప్డేట్ తీసుకొని జగన్ కు ఇస్తున్నాడని, తన పాదయాత్ర జరిగిన చోటల్లా ఒక డ్రోన్ ఎగరేసి ఆయన పీకేదేంటని లోకేష్ ప్రశ్నించారు. పోలీసు అధికారుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు తనతో గోడు వెళ్లబోసుకుంటున్నారని అన్నారు. అన్న ఎన్టీఆర్ మనందరికీ దేవుడని, చంద్రబాబు రాముడని, కానీ, తాను మూర్ఖుడ్నన్న సంగతి వైసీపీ నేతలు గ్రహించాలని వార్నింగ్ ఇచ్చారు.