యువత ఆశాజ్యోతి లోకేష్
యువగలం పాదయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టం
డాలర్స్ యువసేన ఆధ్వర్యంలో తిరుపతి వైకుంఠపురం కూడలిలో మంత్రి ‘నారా లోకేష్’ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మంది పేదలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి యువసేన నాయకులు మాట్లాడుతూ మంత్రి ‘నారా లోకేష్’ యువకుల ఆశాజ్యోతి గా నిలచారని కొనియాడారు.
యువత అభ్యున్నతి కోసం చేపట్టిన యువగలం పాదయాత్ర చారిత్రక ఘట్టంగా నిలిచిందన్నారు.
ఆయన నాయకత్వంలో యువత భవిష్యత్తు బంగారు బాట కానుందని అభిప్రాయపడ్డారు.
పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ‘నారా లోకే’ష్ అభినందనీయులన్నారు.
ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి ప్రజాసేవలో తరించాలని ఆకాంక్షించారు.
అనంతరం డాలర్స్ దివాకర్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో భారీ కేకు ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.