- ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి
టెమాసెక్ స్ట్రాటజిక్ హెడ్ రవి లాంబాతో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్టాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… శరగవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో టెమాసెక్ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి. ఎపి ఇండస్ట్రియల్ క్లస్టర్లలో REIT మోడల్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయండి. వైజాగ్, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయండి. అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్ తో కలసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. వైజాగ్, తిరుపతిలో సెమా టెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డాటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించండి. ఎపిలో మూడు అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్లు, 20 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయి. పవర్ ట్రాన్స్ మిషన్ ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు. రవి లాంబా మాట్లాడుతూ… రాబోయే మూడేళ్లలో భారత ఫైనాన్షియయల్ సర్వీసెస్, హెల్త్ కేర్ రంగాల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాం. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
2. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నవీన ఆవిష్కరణలు జరగాలి
మేక్ ఎఐ ఫర్ ఇండియా ద్వారా నైపుణ్యంగల శ్రామికశక్తి తయారు
ఆంధ్రప్రదేశ్ లో రూ.255 కోట్లతో 3 ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల సమావేశంలో మంత్రి లోకేష్
దావోస్: ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా మార్పు చెందుతున్న సాంకేతికల నేపథ్యంలో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండేలా నవీన ఆవిష్కరణలు కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ ల భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. దావోస్ కుర్ పార్కు విలేజ్ లో జరిగిన ఎడ్యుకేషన్ గవర్నర్ల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సమావేశంలో గ్లోబిస్ యూనివర్సిటీ ఫౌండర్, ప్రెసిడెంట్ యోషితో హోరి, మాంటెర్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ గార్జా (మెక్సికో), పియర్సన్ సిఇఓ ఒమర్ అబోష్ (యుకె), యూనవర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రెసిడెంట్ మిచైల్ స్పెన్స్ (యుకె), నెట్ వర్క్ ఫర్ టీచింగ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రెసిడెంట్ జీన్ డానియేల్ లారోక్ (యుఎస్ఎ), కార్నర్ స్టోన్ ఆన్ డిమాండ్ సిఇఓ హిమాన్షు పల్సులే (యుఎస్ఎ), ఈటిఎస్ సిఇఓ అమిక్ సేవక్ (యుఎస్ఎ), ర్వాండా విద్యాశాఖ మంత్రి జోసెఫ్ సెంగిమన, యుఎఇ విద్యాశాఖ మంత్రి సారా ఆల్ అమిరి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విద్యారంగం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో విద్యారంగంలో కీలకమైన ప్రాధాన్యతలు, సవాళ్లపై చర్చించడానికి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యాన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి చెందిన సిఇఓలు, విద్యారంగ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… తాజాగా అధ్యయనం ప్రకారం వెయ్యికంటే ఎక్కువమంది ఉద్యోగులు కలిగిన 42శాతం సంస్థలు తమ దైనందిన కార్యకలాపాలకు ఎఐని చురుగ్గా వినియోగిస్తున్నాయి. భారతదేశం (59%), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (58%) మరియు సింగపూర్ (53%), AI వినియోగంలో అగ్రగామిగా ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం యునెస్కో ఎఐ కాంపిటెన్సీ ఫ్రేమ్ వర్క్ లను ప్రవేశపెట్టింది. ఎఐతో సమర్థవంతంగా నిమగ్నమవ్వడానికి అవసరమైన నైపుణ్యాలు, నాలెడ్జి, విలువలతో అభ్యాసకులను సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ లో స్వయం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్నాం. విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలు గల అభ్యాసకులకు స్వయం వంటి కార్యక్రమాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నాం. ‘మేక్ ఎఐ ఫర్ ఇండియా’ వంటి కార్యక్రమాలు ఎఐలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని సృష్టించడం, కార్పొరేట్ ప్రతిభ అభివృద్ధి అవసరాలను తీర్చడంపై దృష్టి సారిస్తున్నాయి. భారతదేశంలో ఐదు ఎడ్టెక్ యునికార్న్‌లు ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఎడ్ టెక్ సెక్టార్లో ఫిజిక్స్ వాల్లా, లీడ్, ఎరుడిటస్, అప్‌గ్రాడ్, వేదాంత వంటి సంస్థలు స్కిల్ డెవలప్మెంట్, K12, టెస్ట్ ప్రిపరేషన్ లకు ఆన్లైన్ సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎఐ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి, శిక్షణ పొందిన ఎఐ వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) స్థాపనను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం 2024-25 మధ్యంతర బడ్జెట్ లో రూ. 255 కోట్లు కేటాయించాం. ప్రపంచ పోటీతత్వాన్ని పెంచేందుకు STEM, AI విద్యపై దృష్టి సారించి, 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తయారుచేయాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబానికి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వంటి కార్యక్రమాలకు విద్యారంగ ఆవిష్కరణలు మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నాం. IIT మద్రాస్ వంటి భాగస్వామ్యం ద్వారా AI ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ తన అభ్యాసకులను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) & గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి) పాలసీ (4.0)ని ఇటీవలే ప్రకటించాం.
విస్తృత ఉపాధి కల్పన , సౌకర్యవంతమైన వర్క్‌ఫోర్స్ మోడల్‌తో నిరంతర అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానంలో అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకోవడం, డీప్ టెక్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సాంకేతికత పరిష్కారాలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
3. పూర్తి ప్రతికూల వాతావరణంలో దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు కాలి నడకన వెళ్ళిన మంత్రి లోకేష్.
దావోస్ ప్రస్తుతం మైనస్ -7 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత.
ఎముకలు కొరికే చలిలో ట్రాఫిక్ ను అధిగమించి కాలి నడకన నిర్ణీత సమయానికి కాంగ్రెస్ సెంటర్ కు చేరుకున్న లోకేష్
4. ఆంధ్రప్రదేశ్ లో ఐటి కార్యకలాపాలు ప్రారంభించండి!
విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విప్రో వృద్ధి వ్యూహం, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఐటి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించండి. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, పునరుత్పాదక శక్తిలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటి వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయడానికి నైపుణ్య కార్యక్రమాలపై విప్రోతో సహకరించండి. వైజాగ్, విజయవాడలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, ఆర్ అండ్ డి హబ్‌ల ఏర్పాటును అన్వేషించండి. ఇప్పటికే ఎపిలో హెచ్ సిఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, జోహో, డబ్ల్యుఎన్ ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సియంట్ వంటి సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. త్వరలో విశాఖపట్నానికి టిసిఎస్ రాబోతోంది. ప్రస్తుతం ఎపిలో ఐటి సంస్థలకు పూర్తి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. రిషద్ ప్రేమ్ జీ మాట్లాడుతూ… రాబోయే అయిదేళ్లలో విప్రో జిఇ హెల్త్ కేర్ భారత్ లో తయారీ, ఆర్ అండ్ డి రంగాల్లో 8వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. విప్రో సంస్థ రెండున్నర లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాల్లో గ్లోబల్ ఐటి సేవలను అందిస్తోంది. రూ.3.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటైజేషన్ తో ఏటా రూ.90వేలకోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్, బ్లాక్ చైన్, ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నా, ఎపి ప్రభుత్వ విజ్ఞప్తిపై బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రిషబ్ ప్రేమ్ జీ చెప్పారు
5. కృత్రిమ మేధను సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలి!
ఇంటిలిజెంట్ ఇండస్ట్రీ ప్రయోజనాలు అన్నివర్గాలకు చెందాలి
ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలెడ్జి సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్
దావోస్: ప్రపంచవ్యాప్తంగా 26శాతం గ్లోబల్ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంపొందించుకోవడం, నూతన ఆవిష్కరణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగిస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. “బిల్డింగ్ ద ఎకో సిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్ (Building the Ecosystem for Intelligent Industries) అనే అంశంపై దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో నిర్వహించిన సదస్సుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో భారత పరిశ్రమల ప్రోత్సహక, వాణిజ్య శాఖ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా, జిఎంఆర్ ఇన్ ఫ్రా కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్, జిఎస్‌ఎంఎ (యుకె) డైరక్టర్ జనరల్ వివేక్ బద్రీనాథ్, రోబస్ట్ ఎఐ సిఇఓ ఆంటోనీ జూలెస్, పెప్సికో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అథినా కనౌరియా, ఆగరి (యుఎస్ఎ) సిఇఓ సార్ యోస్కోవిట్జ్ హాజరయ్యారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… కేవలం ఎఫిషియన్సీని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా సామాజిక ప్రయోజనాలు, అసమానతలు తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులను పసిగట్టడం వంటి రంగాల్లో కూడా ఎఐ ఇంటిగ్రేషన్ జరగాలి. ఇంటిలిజెంట్ ఇండస్ట్రీలో ఎఐ వినియోగం ద్వారా అంతర్జాతీతంగా ఉత్పాదకతపరంగా $6.6 ట్రిలియన్లు, వినియోగదారుల నుంచి $9.1 ట్రిలియన్లు ఆదాయ వృద్ధి జరుగుతుందని అంచనాగా ఉంది. ఇది స్థిరమైన, సమ్మిళిత వృద్ధి దిశగా పరిశ్రమలను నడిపించడంలో నాయకత్వ అవసరాన్ని స్పష్టంచేస్తోంది. ఇంటిలిజెంట్ ఇండస్ట్రీ పురోగతిలో వాటాదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా ప్రైవేటు, ప్రభుత్వరంగాలు, విద్యాసంస్థలు, పౌరసమాజాలకు భాగస్వామ్యం కల్పించాలి.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మార్కెట్ 20023లో $515.31 బిలియన్లుగా ఉండగా, 2024కి $621.19 బిలియన్లకు చేరుకుంది. ఇది 2032 నాటికి $2740.46 బిలియన్లకు పెరుగుతందని అంచనాగా ఉంది. 2027నాటికి భారత ఎఐ మార్కెట్ $17 బిలియన్లకు చేరే అవకాశముంది. తయారీ వంటి రంగాల్లో మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లలో 28శాతం మేర ఎఐ ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 4.2లక్షల ఎఐ వృత్తినిపుణులు కలిగిన భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ధ మానవవనరుల కేంద్రంగా ఆవిర్భవించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ 2030నాటికి భారత్ 9లక్షల వైట్ కాలర్, 3.6 మిలియన్ల పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుందని అంచనాగా ఉంది. ఈ పరిణామం వర్క్ ఫోర్స్ ను ఛాంపియన్స్ గా, ఇండస్ట్రీ లీడర్స్ గా తయారు కావడానికి దోహదపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం నాస్కామ్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఐఓటి, ఎఐ అభివృద్ధి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది డీప్ టెక్ ఆవిష్కరణల్లో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడాది రాష్ట్రంలో కొత్తగా 8ఎఐ, ఐఓటి స్టార్టప్ ల కోసం రూ. 131కోట్ల నిధులు పొందాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా ఎపిలోని అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో 3నాలెడ్జి సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఎఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎఐ, 5 ప్రపంచస్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ క్లాస్ టెక్ సర్వీసెస్ హబ్ గా తీర్చిదిద్దాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. విజన్ 2047 మిషన్ లో భాగంగా ఎఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ పై దృష్టి సారించే ప్రధాన డీప్ టెక్ గ్లోబల్ హబ్ గా ఎపిని నిలబెట్టడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం. మా విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు గారి థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకు సాగుతున్నాం. ఎపి ట్రాన్స్ కోలో ఎఐ అండ్ ఎంఎల్ వినియోగం ద్వారా 15నిమిషాల వ్యవధిలో విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తున్నాం. విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడం, గ్రిడ్ నిర్వహణను ఆప్టిమైజ్ చేయడం కోసం ఎఐని వినియోగిస్తున్నాం. విశాఖపట్నంను ఎఐ, టెక్ హబ్ గా మార్చేందుకు వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. గ్లోబల్ సర్వీసెస్, అత్యాధుక ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి గూగుల్ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
6. 2030నాటికి $ట్రిలియన్లను అధిగమించనున్న ఎఐ మార్కెట్
అంతర్జాతీయంగా ఎఐతోపాటు డాటాసెంటర్లకూ డిమాండ్
భారతదేశంలో $64.4 బిలియన్లకు చేరిన జిసిసి ఆదాయం
విశాఖపట్నంలో ఎన్విడియా సహకారంతో ఎఐ యూనివర్సిటీ
భవిష్యత్ ఎఐపై రౌండ్ టేబల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్
దావోస్ : పెరుగుతున్న ఎఐ మార్కెట్ కు అనుగుణంగా ఎఐ డాటా సెంటర్లకు కూడా రాబోయే రోజుల్లో డిమాండ్ పెరగనుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2030 నాటికి గ్లోబల్ ఎఐ మార్కెట్ 1.6 ట్రిలియన్లకు, 2032కు 2.74 ట్రిలియన్లకు చేరనుందని అంటూ మెకన్సీ అండ్ గార్టర్ నివేదికను ప్రస్తావించారు. షేపింగ్ ద ఫ్యూచర్ నెక్ట్స్ జెన్ ఎఐ – ఇన్నొవేషన్ హబ్, డాటా ఫ్యాక్టరీ అండ్ ఎఐ యూనివర్సిటీ (Shaping the Future for Next-Gen AI – Innovation Hub, Data Factory, and AI University) అనే అంశంపై దావోస్ బెల్వడేర్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్విడియా గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎఐ నేషన్స్ శిల్పా కొల్హాట్కర్ (వర్చువల్ గా హాజరు), హార్వర్డ్ యూనివర్సిటీ గ్రోత్ ల్యాబ్ విభాగం డైరక్టర్ రిచర్డో హస్మన్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఇండస్ట్రియల్ ఎఐ ప్రొఫెసర్ అండ్ డైరక్టర్ జె లీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ ఫ్రొఫెసర్ సాదీ క్రీజ్ హాజరుకాగా, ఎన్ డిటివి ప్రాఫిట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నీరజ్ షా సంధానకర్తగా వ్యవహరించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2030నాటికి గ్లోబల్ డాటా సెంటర్స్ డిమాండ్ సగటున 19 నుంచి 22శాతంతో 219 గిగావాట్లకు ఉండొవచ్చని తెలిపారు. డాటా సెంటర్ల మార్కెట్ లో 40శాతం వాటాతో నార్త్ అమెరికా (1000 డాటా సెంటర్లు) ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 1మిలియన్ ఎఐ వృత్తినిపుణుల కొరత ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం బెంగుళూరులోని సిలికాన్ వ్యాలీ ప్రపంచంలో టాప్ ఇన్నొవేషన్ హబ్ గా ఉందని చెప్పారు.
ఎఐలో అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. జాతీయ ఎఐ వ్యూహానికి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, సామాజికాభివృద్ధి కార్యక్రమాల కోసం ఎఐని ఉపయోగించాలన్న లక్ష్యంతో భారత్ పనిచేస్తోంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, వ్యవసాయంతో సహా విభిన్న రంగాల్లో 1600కు పై ప్రస్తుతం ఎఐ స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరో నాలుగు మిలియన్ ఐటి నిపుణులతో ఎఐలో అధునాతన ఆవిష్కరణలు రానున్నాయి. గవర్నమెంట్ ఎఐ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారత్ ప్రపంచ వ్యాప్తంగా 46వస్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జిసిసి) 1800 భారత్ లోనే ఉన్నాయి. 2024లో భారతదేశ జిసిసి ఆదాయం $64.6 బిలియన్లకు చేరినట్లు నాస్కామ్ నివేదిక వెల్లడిస్తోంది. భారతదేశ జిసిసి మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు చేరి, దీనిద్వారా 2.5 మిలియన్ల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా. దేశంలో 57శాతం సంస్థలు ఎఐని వినియోగిస్తున్నాయి, రాబోయే రెండేళ్లలో ఎఐ వినియోగం మరో 25శాతం పెరిగే అవకాశం ఉంది.
అమరావతిని AI సిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలని విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. విశాఖనగరంలో AI విశ్వవిద్యాలయాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి మేము NVIDIAతో ఎంఓయు కుదుర్చుకునే పనిలో ఉన్నాం. ఈ విశ్వవిద్యాలయం పరిశోధన దృష్టిని సంభావితం చేయడంలో మాకు సహాయపడుతుంది. ఎపిలో వరల్డ్ క్లాస్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థలతో మేం టచ్ లో ఉన్నాం. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ లను రప్పించడంలో మా ముఖ్యమంత్రికి విజయవంతమైన చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కి ఐఎస్ బి తెచ్చిన విధానం చంద్రబాబు గారి సామర్థ్యానికి గొప్ప ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 2వేలకు పైగా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద టాలెండ్ పూల్ కలిగి ఈఓడిబి స్టేట్ ర్యాంకింగ్స్ లో నిలకడగా టాప్ అచీవర్ గా ఎపి గుర్తింపు పొందింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఎఐ & ఎంఎల్ లో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాం. భవిష్యత్తులో విద్యార్థుల్లో ఎఐ నైపుణ్యాలను పెంపొందించడానికి 7నుంచి 9వతరగతి వరకు పాఠశాల పాఠ్యాంశాల్లో ఎఐని ప్రవేశపెట్టబోతున్నాం. పింఛనుదారుల గుర్తింపు, పెన్షన్ల పంపిణీ కోసం AI ఆధారిత రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఎఐని వినియోగించి ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన టెక్స్ట్ మెసేజ్ లు పంపడం ద్వారా పంట ఉత్ఫాదకత పెంపుదలకు చర్యలు చేపడుతున్నాం. ఆంధ్రపదేశ్ అత్యాధునిక ఎఐ కటింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్ రూపొందించడమేగాక… భవిష్యత్తులో ఎఐ ఆధారిత ఆవిష్కరణలను కొనసాగించేందుకు దీర్ఘకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
7. ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధికి సహకారం అందించండి!
గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఎపిని గేట్ వేగా నిలపండి
మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు, లోకేష్ భేటీ
దావోస్: మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటి కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తుచేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎపిలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించండి. మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఎపిని గేట్వేగా నిలపండి. మీ సహకారంత స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఎపి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉంది, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు.
8.సిఆర్ డిఎ పరిధిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయండి
ఎయిరిండియా సిఇఓ క్యాంప్ బెల్ విల్సన్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సిఇఓ క్యాంప్ బెల్ విల్సన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. రాష్ట్రంలోని ఏడు ఆపరేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా ఈ ఏడాది 52.51లక్షల ప్యాసింజర్ ట్రాఫిక్ సాధించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్) హబ్ ను ఏర్పాటు చేయండి. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేగాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ప్రతిపాదిత హబ్ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. విమానయానరంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. సిఆర్ డిఎ పరిధిలో దుబాయ్ తరహాలో 3వేల నుంచి 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేయండి. ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే గ్లోబల్ యావియేషన్ లో కీలకపాత్ర వహించడమేగాక ఎపికి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో పైలట్లు/ స్టీవార్డెస్/ టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (GATI) అంచనా ప్రకారం భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాలలో 20వేలమంది పైలట్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పైలట్లకు ఉపశమనం కలిగించేలా పైలట్లను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఫ్లయింగ్ స్కూల్స్ నెలకొల్పాలని మంత్రి లోకేష్ కోరారు.
ఎయిరిండియా ఎండి క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ… ఎయిరిండియా ఇప్పటికే దేశంలోని ప్రధాననగరాల్లో ఆపరేషనల్ హబ్స్ కలిగి ఉంది. మరికొన్ని ఇతర నగరాల్లో MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్) హబ్ లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి ఇటీవల బెంగుళూరులో MRO ఫెసిలిటీని ప్రారంభించాం. ఎయిరిండియా ఫ్లీడ్ అప్ గ్రేడేషన్, అధునిక విమానాలను పరిచయం చేసే ప్రణాళికలు, గ్లోబల్ ఉనికిని బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, సాంకేతికతపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తులపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు
9. ఆంధ్రప్రదేశ్ లో ఆర్ అండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
ష్నైడర్ ఎలక్ట్రిక్ సిఇఓ దీపక్ శర్మతో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎండి, సిఇఓ దీపక్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆసియా పసిఫిక్ దేశాలకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా ఉంది. సువిశాల తీర ప్రాంతం, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 20 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఎపిలో నెలకొని ఉన్నాయి. స్థానిక యువతలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించి, నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎపిలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటుచేయండి. 2026నాటికి భారత్ లో రూ.3,200 కోట్లు పెట్టుబడి పెట్టాలన్న మీ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ ను చేర్చండి. పునరుత్పాదక ఇంధన వనరులు, పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటుచేసేందుకు వీలు భూసేకరణను సులభతరం చేసేందుకు ఎపి ప్రభుత్వం మద్దతు నిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కాంపొనెంట్స్ సోర్సింగ్ చేయడం, స్థానిక సప్లయ్ చైన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సహకారం అందించండి. విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలులో భాగంగా ఎలక్ట్రిక్ నైపుణ్యాలను అందించండి. సమర్థవంతమైన పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ గ్రిడ్ లు, ఐఓటి ఆధారిత సొల్యూషన్స్ లో ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. పునరుత్పాదక శక్తి, పారిశ్రామిక ఆటోమేషన్‌లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేయడం, భవిష్యత్- వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి సాంకేతిక సంస్థలు, స్థానిక విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయాలని కోరారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ దీపక్ శర్మ మాట్లాడుతూ… తమ సంస్థ భారత్ లోని 9 రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తరణకు 3,200 కోట్లు పెట్టుబడి పణాళికలను ఇప్పటికే ప్రకటించింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో 1.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని జోడించడం కూడా మా ప్రణాళికలో భాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దీపక్ శర్మ తెలిపారు.
10. ఎ.పి లో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు సహకారం అందించండి
స్విస్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శామ్యూల్ గగ్గర్ తో లోకేష్ భేటీ
దావోస్: స్విట్జర్లాండ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ నికలస్ శామ్యూల్ గగ్గర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని మేం భావిస్తున్నాం. ఎపిలో నెస్లే, రొషే, నోవార్టిస్, ఎబిబి, క్లారియంట్, హిల్టీ, బుచర్, ఎస్ టి టెలిమీడియా, ఒసి ఒర్లికా వంటి స్విస్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా ఆహ్వానించేందుకు మేం ఆసక్తితో ఉన్నాం. వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు భాగాల విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ, R&D హబ్‌ల ఏర్పాటుకు సహకారం అందించండి. ఎపి, స్విస్ విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేయడానికి మీ సహకారం అవసరం. AI, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్ట్-అప్లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో ఎపి, స్విట్జర్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలను కనెక్ట్ చేయడంలో మీ మద్దతు అవసరమని మంత్రి లోకేష్ తెలిపారు. శామ్యూల్ గగ్గర్ మాట్లాడుతూ… ఎపిలో స్విస్ కంపెనీల కార్యకలాపాలకు తమవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు.
11. హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ఎఐ స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టండి
యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మ,త్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఎపిలో ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పేషెంట్ ఫలితాలను మెరుగుపరచడానికి ప్రాసెస్ ఆటోమేషన్ సొల్యూషన్లను అమలు చేయడానికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌కేర్, AI, రోబోటిక్స్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టండి. రాష్ట్రంలో క్రికెట్, ఇతర స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా యువత ప్రోత్సాహానికి మీ అనుబంధ సంస్థ అనురాగ్ జైన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ లో హిల్ వుడ్ తరహా పెట్టుబడులు పెట్టండి. ఇండస్ట్రియల్ పార్క్స్, ప్లగ్-ఎన్-ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ) ఐటి పార్క్స్ REIT మోడల్ ద్వారా ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయండి. పురోగతిలో ఉన్న మచిలీపట్నం ఓడరేవులో కంటైనర్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయండి. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో (చెన్నై, వైజాగ్ ఓడరేవుల మధ్య) వ్యూహాత్మక కేంద్రంగా ఉంది, ఇది దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలకు దగ్గరగా సాఫీగా కార్గో తరలింపును నిర్ధారిస్తుంది.
వ్యవసాయ, ఆక్వాకల్చర్ జోన్ల కుదగ్గరగా ఉండి, బియ్యం, పండ్లు, చేపల కంటైనర్ ఎగుమతులకు అనువైనదని మంత్రి లోకేష్ చెప్పారు. అనురాగ్ శర్మ మాట్లాడుతూ… అనురాగ్ జైన్ మాట్లాడుతూ… తమ సంస్థ ఎఐ, రోబోటిక్స్, రియల్ ఎస్టేట్, మొబిలిటీ తదితర రంగాల్లో 50కిపైగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. కరోనా సమయంలో అమెరికా, భారత్ లలో 6కోట్ల భోజనాన్ని అందజేశామని చెప్పారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
12. ఎ.పి వర్సిటీలతో కలసి పరిశోధన కార్యక్రమాలకు సహకరించండి
సింగపూర్ వర్సిటీ ఈడి మాథ్యూ ఉక్ చాంగ్ తో లోకేష్ భేటీ
దావోస్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలసి పరిశోధనా కార్యక్రమాలకు సహకరించండి. వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించండి. ఎపి విశ్వవిద్యాలయాలతో కలసి రాష్ట్రంలో ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయండి. స్థానిక పరిశోధకులు, విద్యార్థుల కోసం సింథటిక్ బయాలజీలో శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించండి. స్థానిక బయోటెక్ కంపెనీలు, NCEB భాగస్వామి నెట్వర్క్ మధ్య సహకారాన్ని సులభతరం చేయండి. AP మెడ్‌టెక్ జోన్‌కు సమీపంలోఇన్నొవేషన్ హబ్, R&D క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి నాలెడ్జ్ సపోర్ట్ అందించాలని మంత్రి లోకేష్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా బయోఇంజనీరింగ్ అనుసంధానించే గ్లోబల్ బయోఫౌండ్రీ అలయెన్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఇంపీరియల్ కాలేజి ఆఫ్ లండన్, ఇంజనీరింగ్ బయాలజీ రీసెర్చి కన్సార్టియం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీలతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఉక్ చాంగ్ తెలిపారు.
13. ఎ.పి లో ఆర్ఈ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పండి
ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
దావోస్: ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ప్రగతిశీల ఆలోచనలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం 11 గిగావాట్లుగా ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని 2030నాటకి పెంచాలన్నది మా లక్ష్యం. ఇది మొత్తం దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో 32శాతంగా ఉంది. 2030నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తుంది. రెన్యవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఎపిలో రెన్యువబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుచేసి, ప్రోత్సాక ప్రయోజనాలను అందిపుచ్చుకోండి. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్ లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ మాట్లాడుతూ…. 2023-24లో 5 గిగావాట్ల ఆర్డర్లతో భారత్ లో ఎన్విజన్ అగ్రగామి విండ్ టర్భైన్ సరఫరాదారుగా నిలచింది. భారతదేశంలో 3 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో పూణే లోని నాసెల్లె లో, బ్లేడ్లల కోసం త్రిచిలో రూ.500 కోట్లతో అత్యాధునిక తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేశాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నాం. ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
14. టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేయండి
కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నాం. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ (TEPA) ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేసేలా సహకారం అందించండి. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. క్రిస్టెల్లా మాట్లాడుతూ… రూ.6.2 లక్షల కోట్ల స్తూల జాతీయోత్పత్తో స్విట్జర్లాండ్ జిడిపిలో మేం 11శాతం వాటా కలిగి ఉన్నాం. నెస్లే, ఫిలిప్ మోరీస్, మెడ్ ట్రానిక్స్, లాజి టెక్ ఇంటర్నేషనల్, డెబియోపామ్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు మా ప్రాంతంలో గ్లోబల్ ప్లేయర్లుగా ఉన్నాయి. ఎపి కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు మా వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
15. ఎ.పి లో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయండి
అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: టైర్ల తయారీలో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ కన్వర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయండి. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఎపిలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటుచేయండి. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయండి. స్థిరమైన సప్లయ్ చైన్ నిర్థారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్ధతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టండి. ఎపిలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్గో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ మాట్లాడుతూ… అపోలో టైర్స్, వ్రేడెస్టెయిన్ బ్రాండ్ల క్రింద 100కి పైగా దేశాల్లో అనేక రకాల టైర్ ఉత్పత్తులను తమ సంస్థ మార్కెట్ చేస్తుందని తెలిపారు. US$ 2.3 బిలియన్ల టర్నోవర్‌తో అపోలో టైర్స్ టాప్ 20 గ్లోబల్ టైర్ తయారీదారులలో ఒకటిగా ఉంది. తమ కంపెనీ జర్మనీలోని Reifencom GmbH , నెదర్లాండ్స్‌లోని అపోలో వ్రేడెస్టీన్ BV కొనుగోళ్ల ద్వారా విస్తరించినట్లు చెప్పారు. ఎపి ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీరజ్ కన్వర్ తెలిపారు.