దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ధరలు పెంచినట్లు చెప్పే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మద్యం ధరలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
వ్యాట్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లను తగ్గించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇండియన్ తయారీ ఫారిన్ లిక్కర్ రకాలపై 5 నుంచి 12 శాతం, మిగతావాటిపై 20 శాతం ధరల తగ్గొచ్చు.
ఏపీలో ప్రముఖ బ్రాండ్ల మద్యం దొరక్కపోవడం.. ధరలు భారీగా పెంచడంతో అక్రమ మద్యం, నాటు సారా తయారీ ఎక్కువైపోయింది.
ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం విపరీతంగా రావడం ఎక్సయిజ్ అధికారులు కు పెద్ద సవాలుగా మారింది.
ఈ క్రమంలోనే వీటిని అరికట్టేందుకు ధరలు తగ్గిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజా మార్పుల తరువాత ధరలు తగ్గడమే కాకుండా అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం కూడా దుకాణాలలో అందుబాటులో ఉంచనున్నారు.