జగన్ సీఎం అయితే… అసలు ఇక ఏపీ మామూలుగా ఉండదన్న అబద్ధపు ప్రచారం చేసింది వైసీపీ.
అబద్ధం అని తెలిసినా ఆ అధికారంలోకి ఒకసారి వస్తే ఇక టీడీపీని చంపేసి మనదే శాశ్వత అధికారం అనుకున్నాడు జగన్
సరిగ్గా మూడంటే మూడు సంవత్సరాలు కూడా తనపై నమ్మకం నిలబెట్టుకోలేకపోయాడు
ఆడినమాటలు తప్పడం, ఏం చేస్కుంటారో చేస్కోండి అనడం, వెంట్రుక కూడా పీకలేరు అని సవాల్ చేయడం, ప్రశ్నించినోడిని వేధించడం, నిలదీసినోడిని నరికేయడం వంటి సిద్ధాంతంతో వైసీపీ నేతలు ముందుకు పోతున్నారు.
దీంతో వైసీపీ అంటే దానికో దండంరా బాబూ అని అనే స్థితికి ప్రజలు వచ్చేశారు.
ఇలాంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన నేతలు… తమ చేష్టలతో పార్టీని 60 అడుగుల లోతున పాతేస్తున్నారు.
ఏకంగా నవరత్నల్లో ఒకటైన హామీని మేము అసలు చెప్పనే లేదు అని అడ్డంగా వాదించి ఇరుక్కుపోయారు.
నిన్నటి నుంచి ఒకటే వైరల్ అవుతున్నాయి మద్యనిషేధం వీడియోలు.
అందులో ఇది టాప్ !
మీ నటనలకు ఇవే మా జోహార్లు … అబ్బబ్బ… ఏం ఏం నటనండి ???????????? pic.twitter.com/Moo0bDuxAq
— Ramya Paruchuri (@Ramya47618518) July 30, 2022