వైఎస్ఆర్ కుటుంబం పేరు చెబితే కడప జనం కదిలి వస్తారు…వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ఆర్ వైఎస్ జగన్ అందరూ పులివెందుల పులిబిడ్డలు, సింహాలు అంటూ వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబ అభిమానులు ఊదరగొడుతుంటారనర్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లనే రాజారెడ్డి గడగడలాడించారని, వైఎస్ కుటుంబం కడప పులులు అని డప్పు కొడుతుంటారు. అయితే, రాజారెడ్డి పులివెందుల పులి కాదు…పులివెందుల పిల్లి అని చెప్పే వీడియో ఒకటి వైరల్ గా మారింది. రాజారెడ్డిని దివంగత ఐపీఎస్ ఆఫీసర్ చదలవాడ ఉమేష్ చంద్ర ఎన్ కౌంటర్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారని సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి వైరల్ అయింది.
చదవలాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్…ఈ పేరు వినగానే పోలీసుల రోమాలు గర్వంతో నిక్కబొడుచుకుంటాయి. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, గ్యాంగ్ స్టర్లు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల గుండెల్లో సింహస్వప్నం ఉమేష్ చంద్ర. ఈ తరం వారిలో చాలామందికి ఉమేష్ చంద్ర అంటే హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ దగ్గర ఒక ల్యాండ్ మార్క్ విగ్రహం మాత్రమే. కానీ, 1992-1998 మధ్యకాలంలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ ఉమేష్ చంద్ర పేరు చెబితే అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి.
1995-97 మధ్య కడప జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర పనిచేస్తున్నప్పుడు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉమేష్ చంద్రల మధ్య జరిగిన ఒక యదార్థ ఘటన గురించి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ చెప్పిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ఒక ఫ్యాక్షన్ గొడవలో వైఎస్ రాజారెడ్డి మనిషులను ఉమేష్ చంద్ర అరెస్ట్ చేయగా…తన మనుషులను విడిచి పెట్టాలంటూ ఉమేష్ చంద్రకు రాజారెడ్డి ఫోన్ చేసి హుకుం జారీ చేశారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. అయితే, వారు తప్పు చేశారని, వారిని విడుదల చేయడం కుదరదని రాజారెడ్డికి ఉమేష్ చంద్ర తేల్చి చెప్పారని లక్ష్మణ్ వెల్లడించారు. దీంతో, రాజారెడ్డి ఆవేశంతో ఊగిపోతూ మేం చెప్పినట్లు మీరు చేయాలి అని ఉమేష్ చంద్రనుఉద్దేశించి వ్యాఖ్యానించారని తెలిపారు. అయితే, రాజారెడ్డి బెదిరింపులకు భయపడని ఉమేష్ చంద్ర….మీరు ఎక్కడున్నారో అడ్రస్ చెప్పండి…24 గంటల్లో వచ్చి మిమ్మల్ని ఎన్ కౌంటర్ చేస్తానని రిటర్న్ వార్నింగ్ ఇచ్చారని లక్ష్మణ్ చెప్పారు.
ఈ విషయాన్ని ఉమేష్ చంద్ర స్వయంగా తనకు చెప్పారని ఉప్పల్ లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారైన తనతో చాలా హద్దు మీరు మాట్లాడారని రాజారెడ్డికి ఉమేష్ చంద్ర వార్నింగ్ ఇచ్చారని అన్నారు. మీరు చేసిన హత్యలు, అరాచకాల గురించి నాకు తెలియదనుకుంటున్నారా అని రాజారెడ్డిని ఉమేష్ చంద్ర భయపెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కడప ఎంపీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు తనను పిలిపించారని, ఉమేష్ చంద్రకు సర్ది చెప్పాలని వైఎస్ఆర్ తన కోరారని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నారు.
అంతకుముందే ఇద్దరు జర్నలిస్టు మిత్రులతో ఉమేష్ చంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయన వినలేదని, లక్ష్మణ్ కు ఉమేష్ చంద్రకు బాగా పరిచయం ఉన్నందున లక్ష్మణ్ చెబితే వింటారేమో అని జర్నలిస్టు మిత్రులు చెప్పడంతో తనను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలిపించారని గుర్తు చేసుకున్నారు. ఆ పక్క రూమ్ లోనే ఉన్న వైఎస్ రాజారెడ్డి దగ్గరికి తాను వెళ్ళానని, రాజారెడ్డి భయపడిపోతూ ఉమేష్ చంద్ర ఎన్ కౌంటర్ చేస్తానని అంటున్నాడయ్యా అంటూ తన చేతులు పట్టుకొని భయంతో వణికిపోయారని గుర్తు చేసుకున్నారు.
అప్పటికే తాను ఇంట్లో ఉన్నానో లేదో పోలీసులతో ఉమేష్ చంద్ర ఎంక్వయిరీ చేయించాడని, ఆయన ఎవరి మాటా వినడం లేదని రాజారెడ్డి తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని తేల్చాలని, ఉమేష్ చంద్రకు నచ్చజెప్పాలని అప్పటికే 2 రోజుల నుంచి రాజారెడ్డి..వైఎస్ఆర్ వెంటపడుతున్నారని తెలిపారు. రాజారెడ్డి భయస్తుడన్న సంగతి తనకు అప్పుడు అర్థమైందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను ఉమేష్ చంద్ర తో మాట్లాడి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేయించానని, ఆ వ్యవహారం సద్దుమణిగేలా చేశానని చెప్పుకొచ్చారు.