సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో సినీనటుడు నందమూరి తారకరామారావు.. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తెలుగుదేశం పార్టీని ప్రకటించి. స్థాపించిన 9 నెలల్లోనే.. అంటే 1983 జనవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని.. ఆ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం మొత్తం 294 స్థానాలకుగానూ, 203స్థానాలు దక్కించుకొని, ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు చరిత్ర సృష్టించారు, ఈ సుధీర్గ రాజకీయ చరిత్రకు 40 ఏళ్లు నిండాయి. నాటి నుంచి నేటివరకు మొత్తం 9సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ.. 5 సార్లు అధికారంలోకి వచ్చి, 21 ఏళ్లు అధికారంలో ఉందని ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బలరామ్ నాయుడు దరురి గారు యనిగల బాలకృష్ణ గారు తెలియచేసారు.
ఈ సంధర్భంగా, NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా 1/4/2022 శుక్రవారం 10:00 AM, కార్యక్రమమును కార్యకర్తలు, అభిమానులు , సానుభూతి పరులు , తెలుగువారు తండోప తండలుగా వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగినది.
పార్టీకి నిస్వార్ధసేవ చేస్తున్న మన తోటి సోషల్ మీడియా సభ్యులకు…, అదేవిదంగా ప్రత్యర్థి పార్టీలు మన తెలుగు తమ్ముళ్ల ఆర్ధిక మూలలను దెబ్బతీస్తున్న, బెదరకుండా…! పార్టీ కోసం నిలబడి, తెలుగుదేశం పార్టీ ని, తమ తల్లి గా భావించే మన సోదరులకు…., ముఖ్యంగా 2024 ఎన్నికల్లో. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో కి తీసుకురావాలని. సోషల్ మీడియా సాక్షిగా స్వార్థం లేకుండా, పోరాడుతున్నా మన పసుపు సై నికులకు, మన తోటి సోషల్ మీడియా సభ్యులకు, వందనం, తెలియచేసిన NRITDP కువైట్/ అధ్యక్షులు/ నాగేంద్రబాబు అక్కిలి.
ప్రత్యర్థిపార్టీ పనికట్టుకొని, పసలేని, ప్రజలకు పనికిరాని, పయోజనం లేకుండా చేస్తున్న, తప్పుడు ప్రచారం ఏమిటో తెలుసా…..! కుల ముద్రా…. ఎవరికైనా దమ్ము వుంటే, తెలుగుదేశం పార్టీ మా కులంకు సంబందించిన పార్టీ, అని చెప్పమనండి… OPEN CHALANGE…!!! చెప్పలేరు …!!! ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతనికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన పార్టీ కాదు…..అని తెలియచేసిన NRITDP కువైట్/ అధ్యక్షులు/ నాగేంద్రబాబు అక్కిలి.
ప్రముఖుల ప్రసంగాలు : –
రాణి చౌదరి (NRI TDP కువైట్ మహిళా విభాగం అధ్యక్షురాలు) తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి నప్పటినుండి ఇప్పటివరకు, పార్టీ తెచ్చిన సామాజిక విప్లవం లో, అత్యంత కీలకమైనది స్త్రీలను గౌరవించడం, వారి అభ్యున్నతికి బంగారు బాటలు వేయడం రాజకీయాలలో, పరిపాలనలో, చదువులో, ఆఖరికి ఆస్తిలో కూడా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం. స్త్రీల ఆర్థిక స్వాతంత్రానికి అంత ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం (డ్వాక్రా సంఘాలు ) ఏర్పాటుచేయడం ఫలితంగా అన్ని కులాలలో చదువుకున్న మహిళలు నాయకత్వ అవకాశాలు పొందడం.ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసిన, ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చెందుతుందని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలంటే తప్పనిసరిగా 2024 “ టిడిపి” అదికారంలోనికి తీసుకొని రావలసిన బాద్యత ప్రతి ఒక్క మహిళ పైన వుందని,
రాచూరి మోహన్, (NRI TDP కువైట్, జాయింట్ సెక్రెటరీ), తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, గత నలభై ఏళ్లలో సాధించిన విజయాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ చొరవ గురించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రదాన ఉద్దేశ్యం గా తెలుగు దేశం పార్టీ ని ఆవిర్భవింప చేసారన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించారన్నారు.
రమేష్ కొల్లపనేని NRI TDP కువైట్ (తెలుగుయువత విభాగం సీనియర్ నాయకులు), తన ప్రసంగంలో, దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీల్లో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతీదీ పక్కాగా ఉంటుంది, పక్కాగా చేస్తుంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ తన పాత వైభవం కోసం కష్టపడాల్సిన పరిస్థితి. ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు వయసుతో సంబంధం లేకుండా కష్టపడటానికి ఎప్పటికీ సిద్ధంగా వుంటారు, ఆయనతో కలసి పనిచేసి, తెలుగుదేశం పార్టీ ని అదికారంలోనికి తీసుకొని వచ్చి ఆంధ్రరాష్ట్ర అబివృద్దిని, యువత భవిష్యత్తుని గాడిలో పెడతామని తెలియచేసారు
వలసాని శంకర్ యాదవ్ NRI TDP కువైట్ (బీసీ విభాగం అధ్యక్షులు), తన ప్రసంగంలో మాట్లాడుతు, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలోకి తెచ్చింది టీడీపీ. మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థలను రద్దుచేసి, బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేసిన పార్టీ తెలుగుదేశం. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి, నేతలుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం, ప్రతిఒక్కరు, తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గా చూడకుండా, సాంఘిక విప్లవ సాధనంగా చూడాల్సిన అవసరం వుంది అని తెలియచేసారు.
మల్లి మారతు NRI TDP కువైట్(తెలుగుయువత విభాగం అధ్యక్షులు) తన ప్రసంగంలో, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న నేతలు, ప్రజలపై వేస్తున్న పన్నుల సంగతి ఎందుకు మాట్లాడటం లేదు, చెత్తపై పన్ను వేయడం, విడ్డూరం. ప్రజలపై భారాలు పడకుండా ఉండేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండేవని, ఒక వేళ పెరగవలసి వస్తే ఆ పెంపు రాష్ట్ర ప్రభుత్వమే భరించిన సంగతి నేను మీ దృష్టికి తీసుకొని వస్తు, గర్వపడుచున్నను, నేడు మంచినూనె, చింతపండు, పప్పు దినుసులు ఏది చూసుకున్నా సరే వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మనకు దరలు తగ్గాలంటే తప్పని సరిగా మనం తెలుగుదేశం పార్టీ ని 2024 అదికారంలోనికి తీసుకొని రావలసిన బాద్యత ప్రతి ఒక్కరి పైన వుందని తెలియచేయారు.
వెలిగండ్ల శ్రీనివాసరాజు, NRITDP కువైట్ (తెలుగుయువత విభాగం ఉపాధ్యక్షులు) తన ప్రసంగంలో, టిడిపి కి రాష్ట్రంలో పూర్వ వైభవం తెస్తామని, రాజకీయ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుకు వున్న అవగాహన, పట్టు, దీక్షా, అంకిత భావం, ధైర్యం, నాకు తెలుసు కాబట్టి, తమలోని నైపుణ్యాలకు సానపట్టి, అంధుడైన ధృతరాష్ట్రుడు, బాల్యంలో తండ్రి ప్రేమకు నోచుకోని భరతుడు, గురువులేని ఏకలవ్యులను ఆదర్శంగా తీసుకోని, మన శక్తి సామర్ధ్యాలను మనంతట మనమే సోషల్ మీడియా రెక్కల మీద నమ్మకంతో, కొమ్మల మీద నిద్రించే పక్షుల్లాగా, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, భావవ్యక్తీకరణ ఉన్నత వ్యక్తిత్వానికి మూలస్థంబాలైనటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు నా విన్నపం, 2024 లో మన పార్టీని మనం అదికారంలోనికి తీసుకొని వచ్చి చంద్రన్నకు ముఖ్యమంత్రి పదవి గిఫ్ట్ గా ఇవ్వాలి అని విన్నవించారు .
జనార్ధన్ గుండ్లపల్లి NRI TDP కువైట్ (బీసీ విభాగం ఉపాధ్యక్షులు) తన ప్రసంగంలో తెలియచేసారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 40 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని పదిలం చేసుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రం సమాచారం ప్రజల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైన సందర్భం అని.
మురళి నాయుడు NRI TDP కువైట్ (తెలుగుయువత ప్రధాన కార్యదర్శి), తన ప్రసంగంలో మాట్లాడుచు తెలుగుదేశం అంటే.. ఆత్మగౌరవ నినాదం. తెలుగు జాతి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం అది. ఢిల్లీ పెత్తనంపై చేసిన తిరుగుబాటు. ఢిల్లీకి వంగి వంగి సలాములు కొట్టాల్సిన పరిస్థితి. దీన్ని ఎన్టీఆర్..తెలుగుదేశం పార్టీతో సమూలంగా మార్చి వేశారని తెలియచేసారు ,
పెంచలయ్య పెరుమల NRI TDP కువైట్ (బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి) . తన ప్రసంగంలో మాట్లాడుచు రామరావుగారు ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగితే దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. “మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను” అన్నారట.. ఇలాంటి వారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం , ఈ పార్టీ ని అదికారంలోనికి తీసుకొని రావలసిన బాద్యతగా మనం పోరాడాలి .
అదేవిదంగా ఈరాతి శంకరయ్య, గుండయ్య నాయుడు , రత్నం నాయుడు తుమ్మల, శివకుమార్ గౌడ్, రవి, నెట్టం ప్రసాద్ వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు.