నెల్లూరు ఎయిర్‌పోర్టును త్వరలో అభివృద్ధి చేస్తాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 25న ప్రారంభిస్తారు. 28 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి – మేకపాటి గౌతమ్‌రెడ్డి
— Sakshi TV (@SakshiHDTV) March 24, 2021
కర్నూలు ఎయిర్ పోర్టును జగన్ ఈరోజు ప్రారంభిస్తారట.
అబ్బ జగన్ భలే మొగోడప్పా …. ఏం అభివృద్ధి సేత్తాన్నాడు అనుకుంటున్నారు కదా మరదే పబ్లిటీ అంటే.
ఇపుడు మీ కళ్లు బైర్లుకమ్మే కొన్ని పోస్టులు చూద్దామా?
బీ రెడీ
గత ఏడాదే కర్నూలు ఎయిర్ పోర్టులో దిగినట్టు జగన్ అభిమాని పెట్టిన పోస్టు కింద చూడండి.
2019లో పవన్ కళ్యాణ్ కర్నూలు ఎయిర్ పోర్టును వాడినట్టు పవన్ అభిమాని పెట్టిన పోస్టు కూడా కింద చూడొచ్చు.
ఇది ఒక సామాన్యుడు పెట్టిన పోస్టు 31 డిసెంబరు 2018
ఇపుడు అసలు విషయం చూద్దామా?
2019 జనవరిలోనే కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చిన ఏపీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబును కింద చూడొచ్చు?
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టును ప్రారంభించి జాతికి అంకింతం చేశాము. ఏడాదిన్నరలోనే రూ.110 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని నిర్మించి కర్నూలు జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను,#Janmabhoomi2019 pic.twitter.com/MoOQJt4jJG
— N Chandrababu Naidu (@ncbn) January 8, 2019
pic.twitter.com/Hg9IWnakUqhttps://t.co/3OY8SsECMb
— Eclector (@eclector1419857) March 24, 2021
మరి ఇపుడు జగన్ ఏం ప్రారంభిస్తున్నాడు అని ఇపుడు మీరు అసలుప్రశ్న వేస్తే దానికి సరైన సమాధానం ఉంది.
అన్నీ సిద్ధం చేసిన ఎయిర్ పోర్టులో ఇండిగో వంటి ప్రయివేటు కంపెనీలు తమ విమానాలు నడుపుతుంటే అంటే రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం గురువారం జరుతుంది. దానికి జగనన్న జెండా ఊపుతాడు అన్నమాట.
అనుమతులు తెచ్చి సిద్ధం చేసి పెంచి అభివృద్ధి చేసి రిబ్బన్ కటింగ్ కి రెడీగా చంద్రబాబు సిద్ధం చేస్తే జగన్ వచ్చి కత్తెర తీసుకుని రిబ్బన్ కట్ చేస్తున్నారమాట ఈరోజు.