• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ తప్పు చేస్తోందా ?

admin by admin
November 9, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
488
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అనవసరంగా అధికార వైసీపీ నేతలు తమనెత్తిన తామే చెత్త వేసుకుంటున్నారా ? కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల వ్యవహారం చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుప్పం మున్సిపాలిటిలో 25 వార్డులున్నాయి. అన్నీ వార్డులకు కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్ధుల నామినేషన్లు వేశారు.

అయితే 14వ వార్డులో మాత్రం వివాదం రాజుకుంటోంది. ఇక్కడ నుండి టీడీపీ తరపున ప్రకాష్, ఆయన భార్య తిరుమగళ్ నామినేషన్లు వేశారు. ఇద్దరూ నామినేషన్లు వేసినా చివరకు ఎవరో ఒకరు మాత్రమే పోటీలో ఉంటారు.

ఇద్దరిలో ఎవరు పోటీచేయాలనే విషయం అన్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అయితే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే సోమవారం రిటర్నింగ్ అధికారి ఓ ప్రకటన చేశారు. అదేమిటయ్యా అంటే 14వ వార్డులో నామినేషన్లు వేసిన దంపతులిద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్న కారణంగా ఆ వార్డులో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచిందట. ఇక్కడే సమస్య రాజుకుంటోంది.

రిటర్నింగ్ అధికారి ప్రకటన చేయగానే వెంటనే దంపతులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. తాము కుప్పంలోనే లేమని కాబట్టి ఉపసంహరణ ఎలా చేసుకుంటామని నిలదీశారు. అయితే ఈ వార్డు ఫలితం ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశాం కాబట్టి ఏదైనా అభ్యంతరాలుంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పడం మరీ విచిత్రంగా ఉంది.

నిజంగానే దంపతులు పోటీ నుండి విత్ డ్రా చేసుకున్నదే వాస్తవమైతే ఉపసంహరించుకుంటున్నట్లుగా రాత మూలకంగా ఇచ్చే ఫారంను రిటర్నింగ్ అధికారి చూపుంటే బాగుండేది. అంతే కానీ అలాంటిదేమీ చేయకుండా తాము ప్రకటించేశాం కాబట్టి కోర్టుకెళ్ళమని చెప్పటం పూర్తిగా బాధ్యతా రాహిత్యమనే చెప్పాలి.

నిజానికి ఎంత మంది పోటీలో ఉన్నా గెలిచిదే తామే అన్న నమ్మకం ఉంటే వైసీపీ వాళ్ళు ఇంత గోలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదే సమయంలో ఒక వార్డులో టీడీపీ గెలిచిందనే అనుకున్నా ఈ ఒక్క వార్డుతోనే టీడీపీకి మున్సిపాలిటి సొంతమై పోదు కదా. ఇంకా 24 వార్డులున్నాయి.

ఏ పార్టీకైనా మెజారిటీ సాధిస్తేనే కౌన్సిల్ సొంతమవుతుందన్నది చాలా సింపుల్ లాజిక్. నామినేషన్లు కూడా సక్రమంగా వేయనీయకుండా అడ్డంకులు సృష్టించడం, విత్ డ్రా సమయంలో గోల చేయడం వల్ల వైసీపీకి చెడ్డ పేరే కానీ లాభం లేదు.

కుప్పం మున్సిపల్ ఎన్నికను గెలుచుకుంటామన్న నమ్మకమే నిజంగా ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపేందుకు అధికార పార్టీ అవకాశాలు కల్పించాలి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు తమకు ఇలాగే చేసిందని వైసీపీ నేతలు ఆరోపణలు కూడా సరికాదు.

ప్రజల మద్దతుతో ప్రశాంతంగా గెలచుకోవాల్సిన సీట్లను కూడా దౌర్జన్యాలతో గెలుచుకుంటోందనే ఆరోపణలతో గబ్బుపడుతోంది పార్టీ. ఇది ప్రజాస్వామ్యానికి  ఎంతమాత్రం మంచిది కాదని పాలకులు గ్రహించాలి.

ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో దారుణాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం…
కుప్పం వంటి ప్రశాంతమైన ప్రాంతాల్లో కూడా బిసి అభ్యర్థివి ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల్లో తప్పుకొంటున్నట్టు చేయడం దారుణం. pic.twitter.com/FqTENo2Bfr

— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) November 9, 2021

Tags: ChandrababuchittoorkuppamTDPTelugu desam
Previous Post

నువ్వు దేనికోసం మోడీని తిట్టావో… నువ్వదే చేసేశావ్ కేసీఆర్

Next Post

అయ్యో అలాంటోళ్లు టీడీపీలో లేరే !

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

అయ్యో అలాంటోళ్లు టీడీపీలో లేరే !

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra