బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి కేటీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రచారం నిర్వహిస్తున్న వాహనానికి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కేటీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఈ అపశృతి జరిగింది. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలు ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ ప్రచార రథం వ్యాన్ డ్రైవర్ స్పీడుగా వెళుతూ సడెన్ గా బ్రేక్ వేశాడు. దీంతో, వాహనంపై ఉన్న రెయిలింగ్ పై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పడిపోయారు.
రెయిలింగ్ ముందుకు వంగడంతో దానికున్న సేఫ్టీ రాడ్ కేటీఆర్ పొత్తికడుపులో ఒత్తుకుంది. ఆయన వ్యాన్ పైనే పడిపోగా…ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలు వాహనంపై నుంచి కింద పడ్డారు.సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలకు తీవ్ర గాయాలు కాగా, వారందరికీ స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, ప్రజలు ఆందోళన చెందవద్దని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స తర్వాత కొడంగల్ రోడ్ షో పాల్గొనేందుకు కేటీఆర్ వెళరతారని తెలుస్తోంది.