• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంత, నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణం: కొండా సురేఖ

admin by admin
October 2, 2024
in Movies, Telangana, Trending
0
0
SHARES
115
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైత‌న్య‌, సమంత విడిపోవ‌డానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కార‌ణమంటూ తెలంగాణ మంతి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.  బాపూఘాట్ లో గాంధీ జయంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవ‌డం కేటీఆర్ కు అల‌వాటే అన్నారు. కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్ర‌శ్నించారు.

హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి.. వారి ఫోన్లను ట్యాప్ చేశార‌న్నారు. స‌మంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ వ‌ల్లే ఎంద‌రో హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీని వ‌దిలేస్తున్నార‌ని.. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుస‌ని సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనపై బీఆర్ఎస్ వాళ్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిల‌దీశారు.  

మంత్రి సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు నోరువిప్ప‌లేద‌ని కొండా సురేఖ ప్ర‌శ్నించారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి కానీ.. వ్యక్తిత్వాలను చంపే ప్రయత్నం చేమ‌కూడ‌దంతూ బీఆర్ఎస్ కు హిత‌వు ప‌లికారు. తనపై నీచమైన త‌ప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశామ‌ని సురేఖ తెలిపారు.

అయితే మంత్రి సురేఖ ఆరోప‌ణ‌ల‌పై తాజాగా కేటీఆర్ కూడా స్పందించారు. మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తుంద‌ని ఫైర్ అయ్యారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో త‌మ‌కు సంబంధం లేద‌న్నారు. కొండా సురేఖ, సీతక్కలు మొదట సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాల‌ని.. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Tags: brsCongresskonda surekhaktrMisiter Konda SurekhaNaga ChaitanyasamanthaTelangana newsTollywood
Previous Post

కూతురికి పెళ్లి చేసిన జగ్గీ వాసుదేవ్.. ఇతరుల పిల్లల్ని.. మద్రాస్ హైకోర్టు

Next Post

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం!

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

June 11, 2025
Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Andhra

పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
Load More
Next Post

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం!

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra