అమెరికా లో స్థిర పడిన మన తెలుగు వాళ్ళు, అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ, అక్కడి రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తున్నారు. ఆ రోజుల్లో ఆంధ్ర ప్రజానీకాన్ని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కదంతొక్కించిన ఆంధ్ర సేన పార్టీ వ్యవస్థాపకుడు సోంపల్లి పిచ్చయ్య నాయుడు గారు. ఈ రోజు వారి కుమారుడు బోస్టన్ పరిసర ప్రాంతాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మన తెలుగు వారైనటువంటి నెల్లూరు కి చెందిన ‘సోంపల్లి కృష్ణ ప్రసాద్ ‘అనే ప్రవాస భారతీయ యువకుడు, బోస్టన్ పరిసరప్రాంతం లో వున్న ఫ్రాంక్లిన్ అనే పట్టణ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేయుచున్నారు. ఆయన గడిచిన 20 సంవత్సరాల కాలంలో అక్కడ వున్న ఎంతో మంది తెలుగు వారికి సహాయపడి వారి ఉన్నత స్థితికి చేరుకోవటంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికలలో పోటీచేయడానికి కారణం ఏమని అడగగా, “ప్రస్తుతం అమెరికా జన్మించిన ఎంతో మంది తెలుగు విద్యార్థులు వారి వారి రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రాజకీయాల్లో కి వచ్చే వారి సంఖ్య తక్కువగా వుంది. ముందుముందు రానున్న కాలంలో భావితరాలను, యువతను ప్రోత్సహించి మరెంతో మంది యువకులు ఇలా వివిధ రకాలైన ఎన్నికలలో అమెరికా గడ్డ మీద నిలబడి, మన భారతీయులకు అమెరికా ప్రజలతో సమానత్వము ఉండేలా ప్రేరణ కలిగేలా చేయటమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. “.
ఆయన బోస్టన్ నగరంలో అమరావతి ఉద్యమం లో కూడా చురుగ్గా పాల్గొని, 200 రోజులు 200 నగరాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అమరావతి రైతులకి ప్రవాస భారతీయుల మద్దతు తెలియజేసేరు. వీటికి తోడు ఆయన అక్కడ వున్న “మేక్ ఏ విష్”, “సత్సేవ” మరియు “రెడ్ క్రాస్ ఆర్గనైజషన్” లలో వాలంటీర్ గా చేస్తూ అక్కడ వున్న ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన లాంటి ఎంతో మందికి, సేవా దృక్పథం కలిగిన ఆయన ఆలోచనలు స్ఫూర్తి దాయకం మరియు అమెరికా లో ఉంటున్న మన తెలుగు వారికి ఆయన ముందడుగు గర్వకారణం!!!