వైసీపీ రాజకీయం ఎంత క్రూరంగా ఉంటుందంటే…. ఏపీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఆ పార్టీకి ఎదురుతిరిగే వారిని వేధించడం, తిట్టడం, కొట్టడం, చంపడం… కేసులు పెట్టడం చేస్తారు.
ఇది ఇప్పటికి అనేకసార్లు జరిగిందని ఏపీ అంతటా తెలుసు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ నుంచి మొదలై, రఘురామరాజు ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరకు ఎన్నో ఉదాహరణలు.
మంచి చెడు, మన తన లేదు. పార్టీకి ఎదురుతిరిగితే అన్ని రకాలుగా టార్గెట్ చేయడం వైసీపీ నేతలకు అలవాటు. దీనిని వారించకపోవడం జగన్ కు అలవాటు.
అయితే… అందరూ ఒకేలా ఉండరు కదా. రఘురామరాజు ను కొడితే…. ఆయన చుక్కలు చూపిస్తున్నాడు.
తాజాగా నెల్లూరు శ్రీధర్ రెడ్డిని తిడుతుంటే… ఆయన వేసిన ఒక ప్రశ్న వైసీపీ నేతలకు నోరు లేవకుండా చేసింది. అందుకే ఆ ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇంతకీ వైసీపీకి మైండ్ బ్లాక్ చేసి శ్రీధర్ రెడ్డి స్టేట్ మెంట్ ఏంటో తెలుసా….
పార్టీ నుంచి బయటకు వస్తే జగన్ కి నేను నమ్మక ద్రోహం చేసినట్టా…
సీఎం పదవి ఇవ్వలేదని జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే అది హీరోయిజమా?
అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేసిన ప్రశ్నకు వైసీపీ నోళ్లు మూతపడ్డాయి.