పదేళ్ల కిందట హార్రర్ కామెడీ సినిమాలు బాగా ఆడుతున్న టైంలో ఆ అడ్వాంటేజీని బాగా ఉపయోగించుకున్న చిత్రాల్లో గీతాంజలి ఒకటి. కానీ ఆ తర్వాత ఆ జానర్ అంటేనే జనాలకు మొహం మొత్తేసింది. ఒకే రకం కథలతో తెరకెక్కే హార్రర్ కామెడీలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమవుతుండడంతో ఆ జానర్‌ను పక్కన పెట్టేశారు
టాలీవుడ్ ఫిలిం మేకర్స్. హార్రర్ కామెడీలంటే ఔట్ డేటెడ్ అనుకుంటున్న టైంలో ఇప్పుడు గీతాంజలి మూవీకి సీక్వెల్ చేసింది కోన వెంకట్ అండ్ టీం. గీతాంజలి తరహాలోనే దీనికి కూడా కోన వెంకట్ అన్నీ తానై వ్యవహరించాడు. ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే రాశాడు. సామజవరగమనతో ఫేమ్ తెచ్చుకున్న రచయితలు భాను-నందు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. కొత్త దర్శకుడు శివ తుర్లపాటి రూపొందించిన ఈ చిత్రం గురువారమే రిలీజైంది.
ఐతే సగటు హార్రర్ కామెడీల్లాగే ఈ సినిమా కూడా ఉండడం.. కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోవడం.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడంలోనూ సినిమా విఫలమవడంతో గీతాంజలి మళ్ళీ వచ్చిందికి టాక్ ఏమంత బాగా లేదు. ట్రైలర్ ఆసక్తికరంగా లేకపోవడం ముందే సినిమాకు హైప్ లేదు. తొలి రోజు పూర్ ఓపెనింగ్స్‌తో మొదలైంది ఈ చిత్రం. రివ్యూలు, టాక్ బాలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ తప్పట్లేదు. కానీ సినిమా ఎలా ఉన్నా, ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నా టీం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడం.. అలాగే ప్రమోట్ చేసుకోవడం మామూలే.
కానీ కోన వెంకట్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాకు ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయని.. గీతాంజలి మళ్ళీ వచ్చింది రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నామని.. త్వరలో 50 కోట్ల సెలబ్రేషన్లు నిర్వహిస్తామని ప్రకటించాడు. కోన మాటలు మరీ అతిగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆయనపై కౌంటర్లు పడుతున్నాయి.
బ్రాహ్మణ సమాజం గురించి మాట్లాడుతున్న కోన వెంకట్ కి.. pic.twitter.com/RQchJajv0u
— Chaitanya (@I_Chaitanya) March 25, 2019