తెలంగాణ పర్యటనలో భాగంగా.. అమిత్‌షా.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. అది కూడా రాత్రి వేళ ఎప్పుడో పది గంటలకు.. నోవాటెల్ హోటల్లో. పైగా 45 నిమిషాలు భేటీ అయింది. దీనిలో 20 నిముషాల పాటు.. ఎన్టీఆర్‌తో ఏకాంతంగానే షా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు రాజకీయంగాను హాట్ హాట్ ఎనాలి సిస్లు వస్తున్నాయి. మరి ఇంతగా విశ్లేషణలు వస్తున్నా.. బీజేపీ మాత్రం తన పాటలో స్వరం మాత్రం మార్చడం లేదు. తాజాగా ఈ హాట్ భేటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
దాదాపు 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో ఇద్దరి మధ్య సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగిందని కిషన్ స్పష్టం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లిన వైనంపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటన నచ్చడంతో అమిత్ షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్ సినిమా అంశాలే మాట్లాడుకున్నారని, వారి మధ్య రాజకీయ చర్చలు రాలేదని చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలపైనే ఎక్కువగా చర్చించారని చెప్పారు. అమిత్, ఎన్టీఆర్ భేటీపై విమర్శలకు తాను స్పందించనని, ఏమైనా ఉంటే వారినే అడగాలని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. అయితే.. కిషన్ రెడ్డి ఇచ్చిన ఈ ఎక్స్పెల్నేషన్ను నెటిజన్లు ఎవరూ నమ్మడం లేదు. “లేదు.. సార్ మీరు ఏదో దాస్తున్నారు“ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు.. “కిషన్ సార్ మీ మాటలు నమ్మలేం“ అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ విషయం.. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతుండడం గమనార్హం.
ఆదివారం మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్ శాలువా కప్పి సత్కరించారు.
అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు. అయితే.. నెటిజన్లు మాత్రం మాటల తూటాలు పేలుస్తున్నారు. “కేవలం భోజనం కోసమే జూనియర్‌ను పిలిచారా?“ అని బుగ్గలు నొక్కుకుంటున్నారు.
Comments 1