అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి రాసిన లేఖలో ఒక వాక్యంతో ముగించారు. “దయచేసి ఈ లేఖను భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి నా రాజీనామాగా అంగీకరించండి” అని సింపుల్ గా తేల్చేశారు.
2014లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
జై సమైక్యాంధ్ర పార్టీ అనే తన సొంత రాజకీయ సంస్థను స్థాపించి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దారుణ పరాజయం పొందారు. గత నాలుగేళ్లలో రాజకీయాలకు దూరంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 2018లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
తాజాగా ఆ పదవికి ముగింపు పలికారు.