ఇటీవల సినిమా పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ థాయిలాండ్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే టాలీవుడ్ కు చెందిన ఓ హీరో పెళ్లి న్యూస్ తెరపైకి వచ్చింది. యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టులో ఈ హీరోగారు తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాడు.
ప్రముఖ హీరోయిన్ రహస్య గోరక్ తో ఏడు అడుగులు వేయబోతున్నాడు. 2019లో వచ్చిన `రాజావారు రాణిగారు` చిత్రంలో కిరణ్, రహస్య జంటగా నటించారు. ఇద్దరికీ ఇదే డెబ్యూ ఫిల్మ్ కాగా.. రాజావారు రాణిగారు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా సమయంలోనే కిరణ్, రహస్య మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. మార్చి 13న హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ కిరణ్ అబ్బవరం-రహస్య ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
అయితే ఆగస్టు 22న వీరి వివాహం జరగబోతోంది. తాజాగా ఈ విషయాన్ని హీరోయిన్ రహస్య వెల్లడించింది. నేడు కిరణ్ అవ్వడం బర్త్‌డే కావడంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కాబోయే భర్తకు విషెస్ తెలియజేసింది. కిరణ్ తో గడిపిన ప్రత్యేక క్షణాలను ఓ వీడియోలో బంధించి ఇన్‌స్టా లో షేర్ చేసింది. అలాగే నిన్ను నా భర్తగా పిలిచేందుకు తెగ వెయిట్ చేస్తున్నా.. అందుకు మరో 38 రోజులే ఉంది అంటూ రహస్య తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో కిరణ్-రహస్య వివాహం వచ్చే నెల 22న జరగబోతోందని స్పష్టమైంది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం `క` అనే ఒక బిగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. 1970 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్-సందీప్ దర్శకులుగా వ్యవహరించనున్నారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
View this post on Instagram