దేశంలో ప్రధాని నరేంద్రమోడీపై హోప్ పోయింది. దేశభక్తులం అంటూ దేశపు కంపెనీలను అమ్మేయడం, భారత్ ప్రధానంగా ఆధారపడిన వ్యవసాయంపై కార్పొరేట్ కు అనుకూలంగా చట్టాలు తేవడం ఇవ్వన్నీ కూడా మోడీ చరిష్మాను మసకబారుస్తున్నాయి. ప్రజలు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం వెతుకుతున్న నేపథ్యంలో ఎవరూ కనపడటం లేదు. నిజానికి గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని అయిన మోడీ గుజరాత్ లో ఏం చేశారో ప్రజలకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
వాస్తవానికి ఈ దేశంలో ఢిల్లీ సర్కారుది సక్సెస్ ఫుల్ మోడల్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడి పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చే ప్రయత్నం చేశారు. నిజానికి మోడీకి సరైన ప్రత్యామ్నాయంగా నిలవగలిగిన శక్తి ఆమ్ ఆద్మీపార్టీకి ఉంది. అయితే ఆయనది బ్యూరోక్రాట్ నేపథ్యం కావడంతో ప్రధాన రాజకీయ నేతలు ఆయన పార్టీలో చేరడం లేదు. అయితే, కేజ్రీవాల్ కూడా అలాంటి వారు మాకు అవసరం లేదంటున్నారు. ఢిల్లీలో మూడు సార్లు సీఎం అయిన కేజ్రీవాల్ ఇపుడు జాతీయ రాజకీయాల మీద పడ్డారు.
ఇటీవలే గోవా స్థానిక ఎన్నికల్లో ఆప్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. రాబోయే యూపీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. నిజానికి ఎంఐఎం వంటి పార్టీ దేశ వ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పోటీ చేసి సీట్లు గెలుచుకుంటున్నపుడు కేజ్రీవాల్ పార్టీ ఎంట్రీ ఇవ్వడం పెద్దకష్టమేమీ కాదు.
ఎంఐఎం దేశం కోసం ఏం చేసిందీ లేదు. ముస్లింలకోసం ఏం చేసిందీ లేదు. అలాంటి పార్టీ మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచింది. అలాంటి ఢిల్లీని సక్సెస్ ఫుల్ గా నడిపించిన కేజ్రీవాల్ రాబోయే యూపీ ఎన్నికలపై దృష్టిపెడితే కచ్చితంగా చాలా సీట్లలో విజయం సాధిస్తారు. యూపీ ప్రజలకు కేజ్రీవాల్ పనితనం ఏంటో బాగా తెలుసు. ఇప్పటికే రెండు సార్లు యూపీ ప్రజలు బీజేపీని గెలిపించినా వారి జీవితాల్లో మార్పేమీ రాలేదు. దీంతో యూపీ ప్రజలు కూడా ప్రత్యమ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలు అయిన ఏపీ తెలంగాణల్లో కూడా ఆప్ పార్టీకి చోటుంది. ఆప్ కనుక ఇక్కడ పోటీ చేసి మోడీపై విమర్శలు చేసి స్థానిక పార్టీల బండారంపై ప్రజలకునిజాలు చెబితే ఈసారి కాకపోయినా తర్వాత అయినా ఆ పార్టీకి ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఎలాగూ ఇపుడుసోషల్ మీడియా వేదికే ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నపుడు ఇది పెద్ద విషయం కాదు. మోడీకి ప్రత్యామ్నాయం కోసం ఆశగా చూస్తున్న దేశ ప్రజలకు నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కేజ్రీవాల్ దక్కించుకుంటారో లేదో చూడాలి.