Arrests will not deter our spirit.
Why does the govt fear so much of our leader @RahulGandhi that it takes the help of ED,CBI & police?!
We will continue our unparalleled struggle against both central & state govts that are suppressing the voices of the people. #ChaloRajBhavan pic.twitter.com/YnL59PqfrC
— Revanth Reddy (@revanth_anumula) June 16, 2022
ప్రధాని మోడీ ఆదేశాలు, ఆయన దిశానిర్దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోనే శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు దాడి చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను నిరసిస్తూ రేపు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల దాడి దురదృష్టకరమని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా రేపు జిల్లా కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆందోళనలకు ఆయన పిలుపునిచ్చారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం శోచనీయమన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ విచారణ నిమిత్తం వేధింపులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు.
“కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతియుత నిరసన చేస్తున్న తమపై దాడి చేయించారు. కాంగ్రెస్ శ్రేణులపై అక్రమకేసులను వెంటనే ఎత్తివేయాలి. రాహుల్, సోనియాను విచారణ పేరుతో హింసిస్తున్నారు. ఎస్ఐ కాలర్ పట్టుకున్నారని అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరం. కేసీఆర్, మోదీ ఒకే డైరెక్షన్‌లో నడుస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న జాతీయ నేతలను కూడా వేధిస్తున్నారు.“ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు దాడి చేసి ఉద్రిక్తంగా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేణుకా చౌదరి నిరసన చేస్తున్న క్రమంలో కింద పడి పోతూ ఉండగా ఎస్సైని పట్టుకుంటే దాన్ని దాడిగా చిత్రీకరిస్తూ, అక్రమంగా కేసులు పెట్టడం బాధాకరమన్నారు.
ఈ రోజు కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ మోడీ డైరెక్షన్లో నడుస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Protest led by Telangana Congress Chief Sh. Revanth Reddy in Hyderabad against the summon of ED to Sh. Rahul Gandhi.
We might have lost one or two elections but doesn't mean that support for our leadership is any less.pic.twitter.com/gD7L7XCYuf
— Md Obaidullah (@Mdbaid) June 13, 2022
Youth congress soldiers protested with full vigour…@AnilTpyc pic.twitter.com/CdjgSq7l9J
— Revanth Reddy (@revanth_anumula) June 16, 2022
I strongly condemn this attack on TPCC spokesperson @kiran_chamala by police personnel… pic.twitter.com/WXtvs14RjM
— Revanth Reddy (@revanth_anumula) June 16, 2022
Demonstrated a protest along with @BhattiCLP & @OffDSB as part of #ChaloRajBhavan against ED’s illegal investigation of @RahulGandhi ji driven by vindictive politics of BJP.
Brutal attack by police on cadre & leaders at the behest of CM KCR’s direction to impress PM.@INCIndia pic.twitter.com/TSvsDPPa9R
— Revanth Reddy (@revanth_anumula) June 16, 2022