తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమకాలిన రాజకీయాల్లో ఆయన వ్యూహాలు విభిన్నంగా ఉంటాయని అంటుంటారు. అయితే, ఈ ఎత్తుగడలకు తోడుగా ఆయనలో గొప్ప మార్కెటింగ్ లక్షణాలు సైతం ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హైదరాబాద్ టూర్ విషయంలో ఈ విషయం స్పష్టమైందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజ్‌భవన్‌లో జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. యాదాద్రి దర్శనానికి సీజేను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రి ఆలయానికి వెళ్లాల్సి ఉండగా ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల మరుసటి రోజుకు ఆ పర్యటన వాయిదా పడింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను యాదాద్రి పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలు వేరే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఉన్న కలియుగం దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయంతో సమానంగా ఉండేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రిని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ కలల ప్రాజెక్టుల్లో ఇదొకటి. తను ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన ఈ దేవాలయం యొక్క విశిష్టతను చాటిచెప్పేందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శనానికి ఆహ్వానించారని అంటున్నారు. కనిపించరు కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఉన్న మార్కెటింగ్ టెక్నిక్స్ ఓ రేంజ్లో ఉంటాయంటున్నారు.
#Yadadri temple stands tall in Golden Glow????????
The Yadadri Sri Lakshminarsimha Swamy temple seen in all splendour as the trial run of the special lighting system gets underway.
The renovated temple built with black stone (Krishna Shila) was swathed in golden lighting????@KTRTRS pic.twitter.com/bQxkfiHs6p
— Enugu Bharath Reddy (@BharathReddyBRS) June 13, 2021