తన మాటకారి తనంతో ఇప్పటికే ప్రజలను అనేకసార్లు నమ్మించిన కేసీఆర్… ఇపుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు… నన్ను గెలిపిస్తే మీకోసం పనిచేస్తాను, ఓడిస్తే ఫాంహౌస్ కి పోయి రెస్టు తీసుకుంటాను అన్నారు. అరెరె నిజమేనేమో అని గెలిపించారు. అయినా ఆయన ఫాంహౌస్ కి వెళ్లి రెస్టు తీసుకుంటున్నారు. దీంతో జనానికి మంటెక్కింది. అంతే… దుబ్బాకలో మంటెక్కించారు.
ఉప ఎన్నికల్లో ఓట్లేయకపోతే పథకాలు రావేమో అని ఇంతకాలం ప్రజల్లో ఒక భ్రమ ఉండేది. కానీ దానిని దుబ్బాక పటాపంచలు చేసింది. ఉప ఎన్నికల్లో ఓడిస్తేనే అధికార పార్టీలు ప్రజలకు భయపడతాయన్న కొత్త విషయాన్ని దుబ్బాక ఎన్నిక నిరూపించింది.
అయితే, అక్కడ గట్టిగా గుణపాఠం చెప్పినా తన తీరు మారని కేసీఆర్ మరోసారి తన మాటకారి తనం ఉపయోగిస్తున్నారు.గెలిపిస్తే హైదరాబాదంతా వైఫై ఇస్తారట. ఏడున్నరేండ్లు అయినా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టనే లేదు.
ఇపుడు GHMC లో కొత్త ట్రిక్ ప్లే చేస్తున్నారు. ‘‘మాకు ప్రజలు వంద సీట్లు ఇస్తారు‘‘ ప్రజలను గౌరవించినట్టు…కానీ కేసీఆర్ ఏమన్నారో తెలుసా..
‘‘100 సీట్లను గెలుచుకుంటాం‘‘ అని తన అహంకార తత్వాన్ని ప్రదర్శించారు. ప్రజలు గెలిపిస్తారు అనడానికి, మేము 100 సీట్లు గెలుస్తాం అనడానికి ఎంత తేడా ఉందో అర్థం అయిపోతోంది.
ఈ సందర్భంగా KCR ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారు. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలో, అల్లర్ల హైదరాబాద్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి…అని కేసీఆర్ అన్నారు. అంటే గెలిపించకపోతే హైదరాబాదును కేసీఆర్ ప్రశాంతంగా ఉంచరా? ఏం చేస్తారు? ఒక వేళ GHMC ఎన్నికల్లో బీజేపీ గెలిచిందనుకుందాం… లా అండ్ ఆర్డర్ కేసీఆర్ చేతిలోనే ఉంటుంది కదా. మరి మేయర్ సీటు బీజేపీ గెలిపిస్తే లా అండ్ ఆర్డరును పట్టించుకోరా? కేసీఆర్ మాటల అంతరార్థం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
వరద వచ్చిపోయి నెలన్నర అయినా… ఎన్నికలు వచ్చేదాకా ఆ డబ్బులు ఇవ్వకుండా ఎన్నికలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వం తప్పు చేయడం వల్ల డ్రైనేజీలు సరిగా నిర్వహించకపోవడం వల్ల, కబ్జాలు అరికట్టకపోవడం వల్ల, చెరువు గట్టును జాగ్రత్తగా ఉంచకపోవడం వల్ల జనం వరదలకు మునిగితే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇన్ని తప్పులు చేసినా జీహెచ్ఎంసీలో కేసీఆర్ నే ఓటర్లు ప్రేమిస్తారా? డౌటే మరి .