• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సినిమా వాళ్లపై కేసీయార్ U టర్న్

admin by admin
January 27, 2022
in Movies, Telangana, Top Stories, Trending
0
0
SHARES
292
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాదకద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు..డ్రగ్స్ కట్టడికి వెయ్యిమందితో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామంటు కేసీయార్ ప్రకటించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అన్న పేరే వినిపించకూడదని చాలా గట్టిగా చెప్పారు. అయితే కేసీయార్ చెప్పేదంతా ఉత్తుత్తి బెదిరింపులే అని అర్ధమైపోతోంది. ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించకుండా చేయడం కేసీయార్ కాదు కదా ఎవరి వల్ల కాదు.

ఎందుకంటే దేశవ్యాప్తంగా డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. పైగా హైదరాబాద్ లోని కొన్ని వందల విద్యాసంస్థల్లో డ్రగ్స్ విపరీతంగా వాడుతున్నట్లు ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. డ్రగ్స్ వాడుతున్న వాళ్ళల్లో అత్యంత ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు కాకుండా డ్రగ్స్ వాడుతున్న  సినీ సెలబ్రిటీలకు కొదవేలేదు. వీళ్ళలో ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేసి కోర్టులో నిలబెట్టిన ఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

ఆ మధ్య సినీ సెలబ్రిటీలను చాలామందిని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రోజుల తరబడి పిలిపించి విచారణ జరిపించారు. తమ విచారణలో ఎవరెవరికి డ్రగ్స్ తో సంబంధాలున్నాయి, వాడుతున్నదెవరు ? పెడలర్లుగా పనిచేస్తున్నదెవరు ? అనే విషయాలను ఉన్నతాధికారులు దాదాపు తమ విచారణలో రాబట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే చివరకు ఏమైంది ? సెలబ్రిటీలంతా బాధితులే అని సింపుల్ గా కేసీయారే మీడియా సమావేశంలో తేల్చేశారు.

డ్రగ్స్ వ్యవహారంలో విచారణను ఎదుర్కొన్న వారంతా బాధితులే అని స్వయంగా కేసీయారే తేల్చేసిన తర్వాత ఇక ఉన్నతాధికారులు ఎంత విచారణ చేసినా మాత్రం ఉపయోగం ఏముంటుంది ? అందుకనే అందరినీ వదిలిపెట్టేశారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో డ్రగ్స్ తో సంబంధాలున్న సెలబ్రిటీలను, వాళ్ళ సంతానాన్ని, వ్యాపారస్తులను అందరినీ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టి జైళ్ళకు పంపుతున్నారు. ఉన్నతాధికారులు అంత గట్టిగా ఉంటున్న ఆ రాష్ట్రాల్లోనే డ్రగ్స్ ను కంట్రోల్ చేయలేక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.

కాబట్టి డ్రగ్స్ విషయంలో తాజాగా కేసీయార్ చేసిన ప్రకటనను ఎవరు నమ్మటం లేదు, సీరియస్ గా తీసుకోవటమూ లేదు. వ్యాపారస్తులను, పెడలర్లను, సెలబ్రిటీలను, ప్రముఖుల వారసులపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెడితే అప్పుడు ప్రభుత్వం చిత్తశుద్దిని జనాలు మెచ్చుకుంటారు. అంతేకానీ మీడియా కోసం ఏదో ఒకటి చెప్పేయటం తర్వాత దానికి క్షేత్రస్థాయిలో విరుద్ధంగా జరుగుతున్నది చూస్తూ కూడా జనాలు ఎలా నమ్ముతారు ?

Tags: Drugs caseHyderabadKCRTollywood
Previous Post

తెలుగు పాటలో ఇంత రొమాన్సా… పిల్ల అదరగొట్టింది

Next Post

ఈ విషయం తెలిస్తే ఒమిక్రాన్ బారినపడితే బాగుండనుకుంటారు

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

ఈ విషయం తెలిస్తే ఒమిక్రాన్ బారినపడితే బాగుండనుకుంటారు

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra