ఒకప్పుడు ఆంధ్రలోని పట్టణాలు మొత్తం… ముఖ్యంగా అమరావతి, విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు… హైదరాబాద్ నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కళకళలాడేవి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ హోటళ్లు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా.. భూముల రేట్లు పెరిగి… అమ్మకాలు, కొనుగోలు హడావుడి కనిపించేది.దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ పతనం మొదలైంది. రియల్ ఎస్టేట్ పతనం మొదలవడం అంటే… దానిపై ఆధారపడిన అనేక ఇతర రంగాలు దెబ్బతినేవి. చివరు లిక్కర్ బిజినెస్ పై కూడా ఆ ప్రభావం పడింది. దీంతో కేసీఆర్ కు భవిష్యత్తు కళ్లు ముందు కనపడింది.
అంతే … ఒకపుడు మానుకోటలో తన కార్యకర్తలతో రాళ్లతో కొట్టించిన జగన్ ని కేసీఆర్ దగ్గరకు తీసుకున్నాడు.
అతని కోసం తెలుగుదేశం నేతలను బెదిరించాడు.
ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక సహాయమూ అందించాడని విపరీతంగా ప్రచారం జరిగింది.
కట్ చేస్తే జగన్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ కావల్సిందంతా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చారు.
మరి కేసీఆర్ జగన్ కి ఇంత హెల్ప్ చేసినందుకు తెలంగాణకు జరిగిన లాభం ఏంటి?
అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటల్లోనే చదవండి.