ఔను! తెలంగాణ ముఖ్యమంత్రి గారాల పట్టి కవిత కోసం.. ఎవరిని బలిచేస్తారు? ఎవరిని పక్కకు తప్పిస్తా రు? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లోనూ .. ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ నేతల్లోనూ జోరుగా సాగు తోంది. ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు కేసీఆర్ తన కేబినెట్లో చోటు కల్పించడం ఖాయమనే గుసగుస కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే బరాబర్ ఉన్న మంత్రుల సంఖ్య.. మరో నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేకుండా చేసింది. దీంతో ఉన్న వారిలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఈ జాబితాలో ప్రస్తుతానికి మల్లారెడ్డి పేరు జోరుగా వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో దూకుడు, మంత్రిగా ఆయన పనితీరు సరిగాలేదనే వాదన నేపథ్యంలో ఆయనను తప్పిస్తారని అంటున్నారు.
అయితే.. మరో విషయం ఏంటంటే.. ఈ నెల ఆఖరులో లేదా జనవరి తొలివారంలోనో.. కేబినెట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరా లు పూర్తయ్యాయి. దీంతో మంత్రుల పనితీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్ వాటి ప్ర కారం మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్ని క, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు మరింత గా కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. మంత్రివర్గంలోనూ కొందరు నాయకులు పనిచేయడం మానేసి.. కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని కేసీఆర్ భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఐదుగురు మంత్రుల వరకు పక్కకు తప్పించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రితోపాటు.. హైదరాబాద్ నగరానికే చెందిన మరో మంత్రికూడా ఉన్నారని.. తెలుస్తోంది. ఒకవైపు.. తన కుమార్తె కోసమే కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తున్నాననే వాదన బలప డకుండా.. మంత్రుల పనితీరు ఆధారంగా మారుస్తున్నాననే సంకేతాలు ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేయనున్నారని అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అధికార ప్రతినిధులుగా యువతను తీసుకుంటే.. అటు కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి, ఇటు బీజేపీలో బండి సంజయ్ వంటివారికి చెక్ పెట్టేందుకు బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.