ఈడీ నన్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే… సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ మహిళలను కించపరచినట్లే… కొన్ని నెలల క్రితం KCR కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి.
తామేం చేసినా తెలంగాణ కోసమే.. తామే తెలంగాణ… తమకేం జరిగినా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తిన్నట్లే… నిత్యం KCR కుటుంబం 24యేళ్ళుగా ఇదే డ్రామా నడిపించింది.
పదేళ్ల అధికారంలో కుటుంబ పాలనలో… అవినీతితో అక్రమాలతో తెలంగాణను పీల్చి పిప్పి చేసింది.
KCR చుట్టూ ఉన్న కోటరీ బంధువులు వేలకోట్ల రూపాయలు తెలంగాణ సంపదని కొట్టేశారు.
ఇంత ఆధునిక సమాజంలో కూడా, టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా, ప్రజల్లో చైతన్యం ఉన్న సమయంలో కూడా , లెక్కా పక్కా లేనంతగా దోచేశారు.
తెలంగాణలో ప్రధానంగా వందల వేల ఎకరాలను KCR కుటుంబం రకరకాలుగా కబ్జా పెట్టింది.
చివరికి 10 ఏళ్లకు ఆ దరిద్రాన్ని తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారు.
ఐఫోన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి చొరవగా ఐఫోన్ ఎత్తుకొచ్చిన కెసిఆర్ కూతురు కవిత.. బతుకమ్మలతోనూ, తెలంగాణ జాగృతి ప్రదర్శనలతోనూ.. తానే తెలంగాణ తల్లి అన్నంతగా బిల్డ్అప్ ఇచ్చింది.
ఓ ఇంట్లో అద్దెకు ఉన్న కవిత TRS అధికారంలోకి వచ్చాక… 200 కోట్ల విలువైన ఇంటిని బంజారాహిల్స్ లో కట్టుకోగలిగింది.
చేతికి కోటి రూపాయల గడియారం పెట్టుకోగలిగింది.
ఇక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు, రకరకాల డీల్స్, దందాలు పంచాయతీలు… ఒకటి కాదు.
దుబాయ్ లో ఇల్లు కొనుక్కుంది.
అమెరికాలో కూడా తెలంగాణ డబ్బులతో ఆస్తులు సంపాదించింది.
అదేంటంటే ఏం తెలంగాణ వాళ్లు సంపాదించుకోకూడదా… వ్యాపారాలు చేసుకోకూడదా అని ప్రశ్నించేది? జస్ట్ తెలంగాణ సెంటిమెంటుతో ఏకంగా తెలంగాణ సమాజాన్ని పీల్చి పిప్పి చేసింది కేసీఆర్ కుటుంబం.
అక్రమార్జన మాత్రమే కాదు… దానికి మించిన అహంకారం.. రాజరిక పోకడలు… అంతా అంతా కాదు ఆ విరగబాటుతనం.
ఎంపీగా పోటీ చేసి గెలిచి… ఢిల్లీలో కవిత చేసిన షో అలాంటి ఇలాంటిది కాదు.
2019 ఎన్నికల్లో నిజామాబాద్ లో ఓడిపోగానే నిస్సిగ్గుగా కెసిఆర్ కూతురికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు.
తానేం చేసినా తెలంగాణలో అడిగే వాడేలేదనుకున్నాడు.
తండ్రి, అన్నా, బావ వెన్నుదన్నుతో కవిత చెలరేగిపోయింది.
ఆమె అవినీతి సామ్రాజ్యం హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకు పాకింది.
దాని ఫలితమే లిక్కర్ స్కాం… చివరికి కవిత అరెస్ట్.
కవిత అరెస్టు అయితే తెలంగాణ కదిలిపోద్దని అందరు అనుకున్నారు.
నాలుగు కోట్ల తెలంగాణ జనం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తారని భావించింది కేసీఆర్ కుటుంబం.
భూకంపం పుట్టిస్తాను అనుకున్నాడు కేసీఆర్.
జనం అంతా రోడ్లపై కొచ్చి కవిత వెళ్లే పోలీస్ వాహనాన్ని అడ్డుకుంటారని భావించాడు కేటీఆర్.
ఏం జరగలేదు.
కవిత అరెస్టుని టీవీలో చూసిన జనం భోజనాలు చేశారు.
ఎంటర్టైన్మెంట్ టీవీలు చూశారు.
ఓటీటీలో సినిమాలు చూశారు.
రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు.
అంతకంటే ప్రశాంతంగా తెల్లారింది.
ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు.
కెసిఆర్ కుటుంబం మాత్రమే ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వ్యూహాలు రచిస్తోంది.
కనీసం BRS నాయకులు గానీ కార్యకర్తలు కూడా అసలు కవిత అరెస్టుతో తమకే సంబంధం లేనట్లే ఉన్నారు.
పొగడ్తలతో భజనలు చేసిన వాళ్ళు, పల్లకీలు మోసిన వాళ్ళు, బొకేలు ఇచ్చినవాళ్లు, శాలువాలు కప్పిన వాళ్ళు… వీళ్లంతా ఎక్కడికెళ్లిపోయారో మరి ఇప్పుడు?
చివరికి అమెరికాలో కూడా అదే పరిస్థితి.
కనీసం ఆంధ్రావాళ్లు అయ్యో అన్నారు కానీ, కరుడు కట్టిన తెలంగాణ ఎన్నారై లు కనీస సానుభూతి అన్నా ప్రకటించకుండా వారాంతపు విందు వినోదాలలో మునిగితేలారు.
తెలంగాణ సెంటిమెంట్ పేరుతో 24 ఏళ్లుగా జనాన్ని అన్ని రకాలుగా మోసం చేయగలిగిన కేసీఆర్… అదే జనం ఇప్పుడు నిశ్శబ్దంగా తన పతనాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాడు.
మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే… దేశం మొత్తం అగ్గి పుట్టించేవాడినని.
నిజమే కాళ్లు లేనోడు… నేను లెగిస్తే మనిషిని కాదన్నాడంట.
ఇప్పుడు పుట్టించొచ్చుగా అగ్గి.
KCR దగ్గర ఏమైనా ఆస్తులు తక్కువ ఉన్నాయా? తెలుగు సాహిత్యం చదివిన కేసీఆర్… దాంతోపాటు చరిత్ర కూడా చదువుకొని ఉంటే ఇంకా బాగుండేది.
రాజ్యాలు రాజ్యాధికారాలు ఎలా కూలిపోయాయో… మట్టిలో కలిసి పోయాయో KCR కి తెలిసేది.
కవిత మాత్రమే కాదు… రేపు కేటీఆర్ అరెస్టు అయినా… సంతోష్ రావు జైల్లోకెళ్లినా… హరీష్ రావు పార్టీ మారిపోయినా… భూకంపాలు రావు.
తెలంగాణ తగలబడి పోదు.