`అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు.
చాలా ఏళ్లుగా ఈ కాంబినేషన్‌పై వార్తలు వస్తున్నాయి. నిజానికి బాలయ్య 100వ సినిమాను అనిల్ డైరెక్ట్ చేయాల్సి ఉన్నా పలు కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు వీరి కాంబో సెట్ అవ్వడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహో గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో బాలయ్యతో పాటు మరో హీరో కూడా ఉండబోతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్. సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడని, ఇది ఆయన కెరీర్లోనే ఇంట్రస్టింగ్ రోల్ అవుతుందని టాక్ నడుస్తోంది.
అంతేకాదు, అనిల్ రావిపూడి ఈ విషయంలో ఇప్పటికే బాలయ్యను ఒప్పించి కళ్యాణ్ రామ్‌ను సైతం సంప్రదించాడట. దాంతో ఆయన బాబాయ్ సినిమాలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో వరకు నిజముందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లతో `ఎఫ్ 3` సినిమా చేస్తున్నాడు. `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.