‘కలి’ కంటి కొసల నుంచి పుట్టిన అభినవ నరకాసురులు
అసలే మసలే చెడు కాలమిది! పాడు కాలమిది!!
కాబట్టే.. మూడు యుగాల్లో మూడు కాళ్లు కోల్పోయి
ఒంటికాలిపై కుంటుతున్న ధర్మానికి చెర నుండి
బయటపడడానికి కాస్తంత ఎక్కువ సమయం పట్టింది!!
సత్యాన్ని వధ చేసి.. ధర్మాన్ని చెరబట్టిన పాపం పండింది!
చేయని నేరానికి.. 52 రోజులపాటు అన్యాయంగా
చెర లో ఉన్న ధర్మానికి ఇప్పుడు సమయం వచ్చింది!!
దార్శనికత మూర్తీభవించిన ఆ నిలువెత్తు మహానాయకుడు..
జైలు నుంచి వస్తుంటే చూసి ప్రజల కంట వెలుగొచ్చింది
బందీఖానాలోంచి బయటకు వచ్చే ఆ దార్శనికుడి
చూపులో తొణుకు లేదు! ఆ నడకలో బెణుకు లేదు!!
ఒక్క నిజాయతీకి మాత్రమే తెలిసిన నిర్భీతి అది
మంచి మాత్రమే చేయడం తెలిసిన నిజమైన నాయకుడికే సాధ్యమైన ఠీవి అది!!
^^^
లోకకంటకుడిగా మారిన నరకాసుర వధ.. దీపావళికి కారణమైంది.. అది ద్వాపరయుగం!
దీపావళి ముందు ధర్మానికి స్వేచ్ఛ.. అసుర వధకు నాంది అయింది.. ఇది కలియుగం!!
^^^
మంచిని చెరలో బంధించి మరణాన్ని కొనితెచ్చుకున్నాడు కంసుడు!
భూమాతను తరలించుకుపోయి మృతువుపాలయ్యాడు హిరణ్యాక్షుడు!!
యుగాలు మారినా.. తరాలు మారినా.. మారని సత్యం ఒక్కటే..
మంచిని చెరబట్టే ముష్కరమూకల పన్నాగాలు ఎప్పటికీ పారవు!!
ఎందుకంటే.. చెడు.. ముందు గెలిచినట్టే ఉంటుంది.. కానీ చివరికి ఓడిపోతుంది!
మంచి తొలుత ఓడినట్టే అనిపించొచ్చు. కానీ ఎప్పటికీ సత్యమేవ జయతే!!
ఇది ధర్మం! ఇదే ధర్మం!! ధర్మో రక్షతి రక్షితః