యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేసన్ లో ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే నేడు ఘనంగా వీరి సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంఛింగ్ కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
ఈ కార్యక్రమానికి అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ కుటుంబ సమేతంగా హాజరైయ్యారు. పూజా కార్యక్రమాలతో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై సినిమాను స్టార్ చేశారు. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ఛాన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే #NTRNeel హ్యాష్‌ట్యాగ్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను షురూ చేయనున్నారు. 2026 జనవరి 9న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రిలీజ్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పటి వరకు యాక్షన్ చిత్రాలతో అలరించిన ప్రశాంత్ నీల్.. ఈసారి కొత్త జోనర్ లో వెళ్లబోతున్నారు. భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరిత చిత్రంగా ఎన్టీఆర్ 31ను రూపొందించబోతున్నారు. డ్రాగన్ అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలనతో ఉంది.