యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శక ధీరుడు ‘మహారాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించడం…రాజమౌళి మరోసారి తన మార్క్ డైరెక్షన్ తో మెప్పించడంతో ఈ చిత్రం అమెరికా సహా ఓవర్సీస్ లోని ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాతో చెర్రీ, తారక్ లు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ హీరోలుగా మారిపోయారు.
ఇక, ఈ చిత్రంలో చెర్రీ నటనకు అమెరికా టీవీ సిరీస్ మేకర్ చియో హోడారి కోకర్ ఫిదా అయ్యారు. అంతర్జాతీయంగా పాపులర్ అయి జేమ్స్ బాండ్ పాత్రకు చరణ్ సరిగ్గా సరిపోతాడని ఆయన కితాబిచ్చాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటుల్లో ఎవరు తదుపరి జేమ్స్ బాండ్ కు సరిపోతారన్న ప్రశ్నకు ఆయన రామ్ చరణ్ తో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ నటుల పేర్లు చెప్పారు. ఇలా చరణ్ కు హాలీవుడ్ రేంజ్ ప్రశంసలు దక్కుతున్న తరుణంలో తాజాగా తారక్ కు కూడా అరుదైన గౌరవం దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో జూ.ఎన్టీఆర్ పేరు నామినేట్ అయ్యింది. ప్రతి ఏడాది ఉత్తమ నటీనటుల జాబితాను ముందే ప్రెడిక్ట్ చేసే వెరైటీ ఎడిషన్ అనే మ్యాగెజైన్ తారక్ పేరును ప్రెడిక్ట్ చేసింది. 2023కు గాను బెస్ట్ యాక్టర్ విభాగంలో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరును ఆస్కార్ అవార్డులకు ఆ మ్యాగజైన్ ప్రెడిక్ట్ చేసింది. ఈ వార్తతో తారక్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
అంతేకాదు, ఈ ప్రెడిక్షన్ నిజమై రాబోయే ఏడాది కచ్చితంగా తారక్ కు ఆస్కార్ వస్తుందని అంటున్నారు. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా తప్పక నిలుస్తుందని అంటున్నారు. భీం పాత్రలో తారక్ విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్కు యావత్ ప్రేక్షకులు నీరాజనాలు పలికిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో తారక్ పలికించిన హావభావాలు సూపర్బ్.