టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది లేటెస్ట్ బైక్ లు, కార్లు అంటే పిచ్చి. ఈ కోవలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ కారు నచ్చితే చాలు…అది తారక్ గ్యారేజ్ లో చేరాల్సిందే. ఇప్పటికే తారక్ మోజుపడి తీసుకున్న ఖరీదైన పలు కార్లు ఆయన కలెక్షన్ లో ఉన్నాయి. ఇక తాజాగా తారక్ మనసుపడి మరీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న‘లాంబోర్గిని ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ కారు తారక్ గ్యారేజిలో చేరింది. ప్రస్తుతం ఈ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కారు కొని టాలీవుడ్ స్టార్ హీరో తారక్ రికార్డు క్రియేట్ చేశాడు. దేశంలో ఈ మోడల్ కారు కొన్న తొలి వ్యక్తి, ప్రస్తుతానికి ఏకైక వ్యక్తి కేవలం ఎన్టీఆర్ కావడం విశేషం. ప్రస్తుతం తన గ్యారేజ్ లో ఉన్న ఈ కారులో జనతా గ్యారేజ్ హీరో హైదరాబాద్ రోడ్ల మీద షికారు చేయబోతున్నాడట. గతంలోనూ హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్న తొలి హీరోగా తారక్ నిలిచాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ తరహా కార్లకు కోలీవుడ్ హీరోలు ధనుష్, విజయ్ ట్యాక్స్ సడలింపులు కోరి కోర్టుతో చివాట్లు తిన్న సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుతం ఈ కారుకు చెల్లించాల్సిన భారీ మొత్తం ట్యాక్స్ ను తారక్ చెల్లించాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఫుల్లీ ఆటోమేటేడ్ టెక్నాలజీతో డిజైన్ చేసిన ఈ కారు విలువ రూ.3.16 కోట్లు. కాబట్టి ఈ కారుకు కూడా తారక్ భారీ మొత్తంలోనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. పూర్తి బుల్లెట్ ఫ్రూవ్ అయిన ఈ కారు 200 స్పీడులో వెళ్లినా కుదుపులు లాంటివి ఉండవట. మరి, ఈ లాంబోర్గినిని డ్రైవ్ చేసి తన ఫ్యాన్స్ ను తారక్ ఎప్పుడు సర్ ప్రైజ్ చేస్తాడో వేచి చూడాలి.
తారక్ గ్యారేజీలో ఉన్న ఖరీదైన కార్ల లిస్ట్ ఇదే
Lamborghini Urus Graphite Capsule
Porsche 718 Cayman
Skoda Superb
Range Rover Vogue
Audi Q7
Mercedes-Benz GLS 350d
BMW 720LD