సైనిక బలగాలపై తనకు విస్తృత అధికారాలను కల్పించే చట్టం అమల్లోకి రాగానే డ్రాగన్ దేశపు అధ్యక్షుడు జిన్ పింగ్ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. అధికారాలు చేతిలోకి వచ్చిన మరుసటి రోజే సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఐదారు నెలలుగా సరిహద్దుల్లో మన సైన్యాన్ని డ్రాగన్ దేశపు సైన్యాలు ఉద్దేశ్యపూర్వకంగా కవ్విస్తున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు, తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలో భారీ ఎత్తున సైన్యాలను రంగంలోకి దింపేస్తోంది. రక్షణరంగంలోని నిపుణుల అంచనా ప్రకారం చైనా-భారత్ సరిహద్దుల్లో సుమారు 70 వేలమంది డ్రాగన్ సైనికులు దిగిపోయారు. వీరికి అదనంగా రాకెట్ లాంచర్లు, యుద్ధ ట్యాంకులు, అత్యాధునిక ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి నిల్వలు కూడా సరిహద్దు ప్రాంతాల్లో చైనా రెడీ చేసుకుని ఉందట.
సరే సరిహద్దులో డ్రాగన్ కదలికలను గమనిస్తున్న మన సైన్యం కూడా అంతే ధీటుగా సైన్యాన్ని మోహరిస్తోంది. అయితే డ్రాగన్ లాగ కవ్వింపుచర్యలకు మాత్రం పాల్పడటం లేదు. అయినా గొడవలు తప్పటం లేదు. ఈ నేపధ్యంలోనే రక్షణ రంగానికి సంబంధించి సైన్యంపై సంపూర్ణ అధికారాలను జిన్ పింగ్ కు కట్టబెడుతు చైనా ప్రభుత్వం ఓ నాలుగు రోజుల క్రితమే చట్టాన్ని చేసింది. దాంతో జిన్ పింగ్ కు సైన్యంపై అపరిమితమైన అధికారులు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే సైన్యంతో జిన్ పింగ్ మాట్లాడుతూ ఏ క్షణాన అయినా యుద్ధం వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేయటం విచిత్రంగా ఉంది. భారత్ వైపునుండి యుద్ధ సన్నాహాలు అయితే ఏమీ జరగటం లేదు. మరి ఏ క్షణానైనా యుద్ధం రావచ్చని అధ్యక్షుడు పిలుపివ్వటంలో అర్ధమేంటి ? తెరవెనుక నుండి డ్రాగన్ సైన్యమే ఏదో కుట్రలు మొదలుపెట్టిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.