వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో చిక్కుకుని విల విల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 1.6 కోట్ల రూపాయల ఫైన్ కూడా చెల్లించా రు. అయినప్పటికీ.. ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. దీనిని ఆయన ఖండించారు. మహిళ అని కూడా చూడకుండా తన సతీమణి జయసుధపై కేసులు పెట్టారని.. తన కుమారుడు కృష్ణమూర్తి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని.. రాజకీయంగా తనను సమాధి చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఎక్కడో అనంతపురంలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డితగులుకు న్నారు. అంతేకాదు.. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. చేసిన చిందులకు సంబంధించిన పోస్టర్లను నగర వ్యాప్తంగా అతికించారు. `ఇప్పుడు చూడు పేర్నీ!` అంటూ.. విరుచుకుపడ్డా రు. అంతేకాదు.. పేర్ని మాటలకు `మాటకు మాట` అన్న తరహా జేసీ విమర్శలు గుప్పించారు. మహిళలు మీ ఇంట్లోనే ఉన్నారా? పిల్లలు నీకే ఉన్నారా? అంటూ.. తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.
నాడు నిండు సభలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అనరాని మాటలు అన్నప్పుడు.. పేర్ని మొహం ఎక్కడ పెట్టుకున్నాడని ఘాటుగా ప్రశ్నించారు. పిల్లలు నీకే ఉన్నారా? నాకు లేరా? మా పిల్లకాయలపై కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు? మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తురాలేదా? అంటూ ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు నాని తనను కూడా టార్గెట్ చేశారని చెప్పిన జేసీ.. తనపైనా తప్పుడు కేసులు పెట్టించారని ఆధారాలతో సహా చూపించారు.
పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శలు చేయలేదా? అని ప్రశ్నించారు. విక్టోరియా ఎవరో తెలుసుకోవాలంటే బందరుకో, మచిలీపట్నానికో పోయి అడుక్కోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ మంచోడు కాబట్టి ఊరుకున్నాడు కానీ మనుషులు లేక కాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మంచి నాయకుడు మంచి వ్యక్తి అని ఆయన ఊ.. అంటే పేర్ని బతుకు బందరు లాకుల్లో కలిసి పోతుందని తీవ్రస్తాయిలో హెచ్చరించారు.