సీనియర్ నాయకుడు… తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బోరున విలపించారు. ఏదో తన ఇంట్లో కష్టం వచ్చినట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనినిచూసిన వారు.. ఇదేదో ఎన్నికల స్టంటుగా అభివ ర్ణించారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికిమళ్లీ టికెట్లు కావాలి కాబట్టి.. ఇప్పుడు ఇలా చేస్తున్నారనే కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపించాయి. కానీ, వాస్తవం చూసే ప్రయత్నం చాలా కొద్ది మంది మాత్రమే చేశారు.
ప్రభాకర్‌రెడ్డి చెప్పినట్టుగా.. నారా లోకేష్ పుట్టుకతోనే శ్రీమంతుడు. తాతగారు మాజీ సీఎం.. తన తండ్రి.. మాజీ సీఎం.. పైగా.. ఉన్నతస్థాయి కుటుంబం. ఉన్నత చదువులు. సో.. ఆయన కాలుపై కాలేసుకుని కూర్చుంటే ఎవరు మాత్రం కాదంటారు. ఇప్పటికీ.. నందమూరి కుటుంబంలో చాలా మంది ఇలానే చేస్తున్నారు కదా! ఇతర పార్టీల నుంచి తిట్లు తినలేం అంటూ.. ఎవరికి వారు రిజర్వ్ చేసుకున్నారు కదా!
కానీ, వీటిని పక్కన పెట్టి.. ఎండనక.. గాలనక.. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. పైగా.. ప్రస్తుతం ఎండా కాలం విజృంభిస్తోంది. భారీ ఎత్తున 11 గంటలకే వడగాల్పులు వీస్తున్నాయి. పిట్ట కూడా రోడ్డెక్కేందుకు సాహసించడం లేదు. అయినా.. కూడా నారా లోకేష్ తన ఆస్తిపాస్తులను పక్కన పెట్టి మరీ.. పాదయాత్ర చేస్తున్నారంటే.. తనకు తాను ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే ఆలోచన లేదుకదా! కేవలం ప్రజల కోసమే కదా!
ఎందుకంటే.. నారా లోకేష్ పాదయాత్ర చేసినా.. సీఎం అయ్యేది నారా చంద్రబాబు నాయుడే తప్ప.. లోకేష్ కాదు. మహా అయితే.. ఒక మంత్రి పదవి ఇస్తారు. అంతటితో సరి! ఈ మంత్రి పదవి గతంలో పాదయాత్ర చేయకపోయినా.. గత ప్రభుత్వంలో నారా లోకేష్‌కు దక్కింది. మరి ఈ విషయం తెలిసి కూడా ఇప్పుడు ఎండను సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నది.. ఆయన వ్యక్తిగతం కోసం కాదనేది జేసీ చెప్పినట్టు వాస్తవం. మరి ఈ విషయం తెలుసుకోకుండా.. కొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేయడం.. సరికాదని అంటున్నారు పరిశీలకులు.